Home » నాగార్జున చెప్పిన మాటలు అఖిల్ వినలేదా..? అందుకే ఏజెంట్ ఫ్లాప్ అయ్యిందా..?

నాగార్జున చెప్పిన మాటలు అఖిల్ వినలేదా..? అందుకే ఏజెంట్ ఫ్లాప్ అయ్యిందా..?

by AJAY
Ad

ఊహ తెలియ‌క‌ముందే సిసింద్రీ సినిమాలో మెయిన్ రోల్ చేసిన అఖిల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ సినిమాలో అఖిల్ క్యూట్ నెస్ తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు. బుడి బుడి అడుగులు క్యూట్ స్మైల్ తో చిన్న వయ‌సులోనే స్టార్ అయిపోయాడు. ఇక పెరి పెద్ద‌వాడైన‌ త‌ర‌వాత మాత్రం అఖిల్ కు స‌రైన హిట్ ప‌డ‌టం లేదు. ఎంత ప్రయ‌త్నించినా కూడా అఖిల్ కు హిట్ ప‌డ‌టం లేదు.

Advertisement

వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అనే టైటిల్ తోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత అఖిల్ ల‌వ్ …మాస్ ఇలా అన్ని ర‌కాల పాత్ర‌లు చేశాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన అఖిల్ సినిమాల‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా త‌ప్ప మ‌రో సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. అఖిల్ మొద‌టి సినిమానే స్టార్ డైరెక్ట‌ర్ చేశాడు అయినా హిట్ ప‌డలేదు.

Advertisement

అంతే కాకుండా వ‌రుస ఫ్లాప్ ల‌తో ఉన్న స‌మ‌యంతో అక్కినేని ఫ్యామిలీకి హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమా కూడా హిట్ అవ్వ‌లేదు. ఇక రీసెంట్ గా ఏజెంట్ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో అఖిల్ లుక్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. సినిమా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కావ‌డంతో సినిమా పై అంచ‌నాలు పెరిగాయి.

మ‌రోవైపు సినిమా స్పై థ్రిల్ల‌ర్ కథాంశం తో తెర‌కెక్కింది. కానీ క‌థ లో ద‌మ్ము లేక‌పోవ‌డం అఖిల్ యాక్టింగ్ స్కిల్స్ పూర్ గా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు నిరాశ చెందారు. దాంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే నాగార్జున అఖిల్ ను ల‌వర్ బాయ్ లా ఉంటావు కాబ‌ట్టి రొమాంటిక్ ల‌వ్ స్టోరీల‌నే ఎంచుకోవాల‌ని క‌థ‌ల‌ను స‌రిగ్గా ఎంచుకోవాల‌ని చెబుతాడ‌ట‌. కానీ అఖిల్ మాత్రం త‌న‌కు క‌థ న‌చ్చిందంటే ప్రొసీడ్ అవుతాడ‌ట‌. ఆ త‌ప్పు వ‌ల్లే అఖిల్ కు స‌రైన హిట్ ప‌డ‌టం లేదు అని కూడా ఇండ‌స్ట్రీలో ఓ టాక్ ఉంది.

ALSO READ :వైర‌ల్ అవుతున్న బాల‌య్య వ‌సుంధ‌రల శుభ‌లేఖ‌…స్పెషాలిటీ ఏంటంటే..!

Visitors Are Also Reading