Home » వైర‌ల్ అవుతున్న బాల‌య్య వ‌సుంధ‌రల శుభ‌లేఖ‌…స్పెషాలిటీ ఏంటంటే..!

వైర‌ల్ అవుతున్న బాల‌య్య వ‌సుంధ‌రల శుభ‌లేఖ‌…స్పెషాలిటీ ఏంటంటే..!

by AJAY
Ad

నంద‌మూరి న‌ట‌వారసుడి ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయిన హీరో నంద‌మూరి బాల‌కృష్ణ. ఎన్టీఆర్ కు కుమారుల‌లో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకుని అభిమానులను సంపాదించుకుంది ఒక్క బాలకృష్ణ మాత్ర‌మే. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న బాల‌య్య కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేశారు. ముఖ్యంగా మాస్ ఓరియెంటెడ్ సినిమాల‌తో..ఫ్యాక్ష‌న్ సినిమాల‌తో బాల‌య్య అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

ALSO READ : దూకుడు సినిమాలో శ్రీను వైట్ల చెప్పిన ఎమ్మెల్యే గా ప్రకాష్ రాజ్ స్టోరీ ఎవరిదో తెలుసా ?

Advertisement

Also Read: BREAKING : హిజాబ్ పై క‌ర్నాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు…!

అంతే కాకుండా ఆద్యాత్మిక పాత్ర‌లతోనూ బాల‌య్య త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్నారు. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య కూడా ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత బాల‌య్య గోపించంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ను ప్రారంభించారు.

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌య్యింది. ఈ సినిమా నుండి ఓ పోస్ట‌ర్ ను విడుదల చేయగా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. మ‌రోవైపు బాల‌య్య త‌న టాక్ షో ద్వారా కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఆహాలో బాల‌య్య అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేసి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టారు. ఇక సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే బాల‌య్య రియ‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే వసుంద‌ర‌ను వివాహం చేసుకున్నారు.

బాల‌య్య పెళ్లి స‌మ‌యానికి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో బిజీ అవ్వ‌డంతో ఎన్టీఆర్ స్నేహితుడు నాదెండ్ల భాస్క‌ర‌రావు పెళ్లి భాద్య‌త‌ల‌ను చూసుకున్నారు. త‌మ బంధువులు అయిన వ‌సుంద‌ర దేవితో బాలయ్య‌కు సంబంధాన్ని కుదుర్చారు. వ‌సుంద‌ర దేవి తండ్రి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త దేవుర‌ప‌ల్లి సూర్యారావు. ఇక 1982 డిసెంబ‌ర్ 8న వ‌సుంద‌ర దేవి బాల‌య్య వివాహం జ‌రిగింది. ఇక ప్ర‌స్తుతం వీరి పెళ్లి శుభ‌లేఖ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading