Home » ధోనితో బ్రేక‌ప్ పై హాట్ బ్యూటీ ల‌క్ష్మిరాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ధోనితో బ్రేక‌ప్ పై హాట్ బ్యూటీ ల‌క్ష్మిరాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Bunty

లక్ష్మీ రాయ్.. ఈ పేరు తెలియని వారుండరు. హాట్‌ లుక్స్‌, స్టన్నింగ్‌ ఫర్‌ ఫామెన్స్‌ తో… అటు తమిళ్‌, ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ లక్ష్మీ రాయ్. కాంచనమాల కేబుల్ టీవీ అనే మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ లక్ష్మీరాయ్. మొదటి సినిమాలోనే చాలా పద్ధతిగా కనిపించిన ఈ నటి… ఆ తర్వాత చాలా బోల్డ్ గా కనిపించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది లక్ష్మీ రాయ్. అయితే.. లక్ష్మీరాయ్.. మహేంద్ర సింగ్ ధోనీ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ధోనీతో లవ్ ట్రాక్ నడిపిన విషయం పై స్పందించింది నటి లక్ష్మీరాయ్. 2008 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి గా ధోని ఉన్న సమయంలో నే… డేటింగ్ లో ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఐపీఎల్ మ్యాచ్ అనంతరం జరిగే పార్టీలకు ధోనీ తో కలిసి లక్ష్మీరాయ్ హాజరైనట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే 2008 నుంచి 2009 వరకు వారి డేటింగ్ కొనసాగినట్లు రూమర్స్ కూడా వచ్చాయి.

అయితే ఊహించని విధంగా ధోనీ అలాగే లక్ష్మీ రాయ్ ఏడాది లోపే బ్రేకప్‌ చెప్పుకున్నారు. తాజాగా ధోని బ్రేక్ పై లక్ష్మీరాయ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ధోనీ తో తనకు ఉన్న సంబంధం ఓ మచ్చగా మిగిలిపోతుందని అభిప్రాయపడింది. అలాగే ఈ మచ్చ కొన్నేళ్ల వరకు ఉంటుందని… అది మాయం కాదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా అందరూ తెచ్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం లక్ష్మి రాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Visitors Are Also Reading