Home » ”అఖండ” సినిమాలోని ఆ ఎద్దుల గురించి తెలుసా ?

”అఖండ” సినిమాలోని ఆ ఎద్దుల గురించి తెలుసా ?

by Bunty
Ad

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా అఖండ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ హిట్ కాంబినేషన్ లో లో రావడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. ఇక ఈ సినిమా బాగుందని.. సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు.  ఇక తమన్ మ్యూజిక్ అఖండ ఉగ్రరూపం ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తే… ఎద్దుల ఫైటింగ్ సీన్ కు ఫిదా అవ్వని వారు ఉండరు. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునే లా ఈ ఎద్దుల ఫైటింగ్ సినిమాలో మనకు కనిపిస్తుంది.

Advertisement

Advertisement

దీంతో ఈ ఎద్దుల ప్రత్యేకత ఏంటి అని చాలామంది వెతకడం మొదలుపెట్టారు. ఈ అఖండ ఎద్దులు చౌటుప్పల్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ కు చెందినవి. స్థానికంగా తన గోశాలలో అవులు, కోడలు పెంచే శ్రీనివాస రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు, కృష్ణుడు, అర్జునుడు అని పేర్లు పెట్టాడు. అంతేకాదు పేరు పెట్టి పిలిస్తే వచ్చేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చాడు శ్రీనివాస్. గతేడాది రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతూ ఉండడంతో ఎద్దుల చర్చ వచ్చింది.

Balayya akhanda movie review

ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాస్ తన కోడెల కు సంబంధించిన వీడియోలు చూపించాడు. ఆ వీడియో లకు ఫిదా అయిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్.. వెంటనే శ్రీనివాస్ తో మాట్లాడి… ఆ ఎద్దులతో షూటింగ్ నిర్వహించారు. అయితే.. బోయపాటి వాటి.. ప్రాధాన్యతను సినిమాలు హైలెట్గా చూపించి… సినిమా హైప్ ను పెంచేశారు. ప్రస్తుతం అఖండ సినిమాకు వెళ్ళిన వారు ఆ గిత్తెలను చూసి ఫిదా అయిపోతున్నారు.

Visitors Are Also Reading