Home » జియోకు షాక్ త‌గిలిన‌ట్టేనా..? 5 జీలో మేమే ముందంటున్న ఎయిర్‌టెల్..!

జియోకు షాక్ త‌గిలిన‌ట్టేనా..? 5 జీలో మేమే ముందంటున్న ఎయిర్‌టెల్..!

by Anji
Ad

డిజిట‌ల్ ఎకాన‌మికి మ‌ద్ద‌తుగా శ‌క్తివంత‌మైన నెట్ వ‌ర్క్ తో 5-జీ సేవ‌ల‌ను భార‌త్ కి ప‌రిచ‌యం చేయ‌డంలో కంపెనీ ముందంజ‌లో ఉంటుంద‌ని భారతీ ఎయిర్ టెల్ చైర్మ‌న్ సునిల్ మిట్ట‌ల్ తెలిపారు. అంద‌రికంటే ముందుగా భార‌త్ లో 5 జీ ప‌రీక్ష‌ల‌ను జ‌రిపిన‌ట్టు ఎయిర్ టెల్ 2021-22 వార్షిక నివేదిక‌లో గుర్తు చేసారు. ధైర్యం, విశ్వాసంతో ముందుకు సాగండి శీర్షిక‌తో వాటా దారుల‌కు ఆయ‌న సందేశం ఇచ్చారు. ఇక రాబోయే కాలంలో అసెట్ లైట్ విధానాన్ని కొన‌సాగిస్తూనే డిజిట‌ల్ సేవ‌లు కంపెనీ ఆదాయానికి అనేక బిలియ‌న్ డాల‌ర్ల‌ను జోడిస్తాయి. ఎయిర్ టెల్ డిజిట‌ల్ ప్ర‌యాణంలో అందించిన ప్రారంభ విజ‌యాలు ఈ విశ్వాసాన్ని క‌లిగిస్తున్నాయి. 5-జీ క్లౌడ్ గేమింగ్ అనుభ‌వాన్ని ప్ర‌ద‌ర్శించిన తొలి భార‌తీయ టెలికాం సంస్థ‌గా నిలిచాం.

Advertisement

Advertisement

అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో క‌నెక్టివిటీ కోసం 700 మెగా హెట్జ్ బ్యాండ్ లో ట్ర‌య‌ల్స్ చేప‌ట్టిన మొద‌టి ఆప‌రేట‌ర్ పేరు తెచ్చుకున్నాం. కోవిడ్‌-19 కొత్త ర‌కాలు, భౌగోళిక రాజ‌కీయ సంక్షోభాలు, అంత‌కంతకు పెరుగుతున్న వ‌స్తువుల ధ‌ర‌లు, అధిక ద్ర‌వ్య‌ల్బ‌ణం మ‌ధ్య 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ఒక ప్ర‌కాశవంత‌మైన ప్ర‌దేశంగా ఉద్భ‌వించింది. మ‌న‌మంద‌రం ఒక పెద్ద ముంద‌డుగు వేయడానికి సిద్ధం కావాలి. నూత‌న విశ్వాసంతో కొత్త మార్గంలో ప‌నులు చేయ‌డానికి ధైర్యం క‌లిగి ఉండాల‌ని వార్షిక నివేదిక‌లో వివ‌రించారు. 5 జీ స్పెక్ట్ర‌మ్ వేలం కౌంట్ డౌన్ మొద‌లైనందున సునిల్ మిట్ట‌ల్ వ్యాఖ్య‌లు ప్రాముఖ్య‌తను సంత‌రించుకున్నాయి.

మొత్తం రూ.4.3 ల‌క్ష‌ల కోట్ల విలువైన 72 గిగా హెట్జ్ రేడియో త‌రంగాల‌ను జులై 26 నుంచి వేలం వేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జులై 22, 23 తేదీల్లో టెలికాం శాఖ మాక్ యాక్ష‌న్ నిర్వ‌హిస్తోంది. రిలియన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్‌, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంట‌ర్ ప్రైసెస్ సైతం వేలంలో పాల్గొంటున్నాయి.

Also Read : 

దాసరిని పక్కన పెట్టి లంకేశ్వరుడు సినిమాలోని పాటలను చిరంజీవి ఎందుకు చిత్రించారు…?

Chanakya Niti : సంతోష‌క‌ర‌మైన వైవాహిక జీవితం కావాలంటే చేయాల్సిన నాలుగు ప‌నులు ఇవే..!

 

Visitors Are Also Reading