అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా విడుదలై దాదాపు మూడు నెలల సమయం అవుతోంది. అయినప్పటికీ ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి రీ ఎడిట్ చేస్తున్నారని.. కొత్త వెర్షన్ ని అతి త్వరలోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలలో వాస్తవం లేదని నిర్మాత అనిల్ సుంకర ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఏజెంట్ ని రీ ఎడిట్ చేస్తున్నారనే వార్తలో వాస్తవం లేదని.. ఒరిజినల్ కాపీ తమ వద్దనే ఉందని.. ఓటీటీలో ఎప్పుడూ రిలీజ్ అవుతుంది అన్నది సోనీ లివ్ సంస్థ నిర్ణయం మీద ఆధారపడి ఉందని అనిల్ సుంకర స్పష్టం చేశాడు.
Advertisement
ఇక దీంతో గత కొంత కాలంగా వస్తున్నటువంటి రూమర్స్ కి చెక్ పెట్టినట్టయింది. ఏజెంట్ లాంటి డిజాస్టర్ సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. అయినప్పటికీ వాటిలో ఏ సినిమాను కూడా ఇలా ఓటీటీలో విడుదల చేయకుండా ఆపలేదు. సోనీలీవ్ టీమ్ ఏజెంట్ సినిమాను విడుదల చేయకుండా ఆపడానికి కారణం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. బ్లాక్ బస్టర్ సినిమాలనే 40 రోజుల తరువాత ఓటీటీలో విడుదల చేస్తున్న ప్రస్తుత పరిస్థితిలో డిజాస్టర్ అయినటువంటి ఏజెంట్ మూవీని 100 రోజులకు విడుదల చేస్తే ఆడియెన్స్ కి చూడాలనే ఆసక్తి ఉండటం అసాధ్యమనే చెప్పాలి.
Advertisement
ఏజెంట్ డిజాస్టర్ తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి తన తరువాత సినిమా కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. అఖిల్ కూడా కొంత గ్యాప్ తీసుకొని తరువాత ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడట. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఏది ఏమైనప్పటికీ.. ఓటీటీ స్ట్రీమింగ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంది.సోనీలీవ్ ఏజెంట్ మూవీని ఎప్పుడూ రిలీజ్ చేస్తుందో వేచి చూడాలి మరీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అక్కినేని హీరోల పేర్ల ముందు ‘నాగ’ అని ఎందుకు ఉంటుందో తెలుసా…?