Home » SALAAR TEASER : కేజీఎఫ్ ని మించిన ప్రభాస్ ‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే..!

SALAAR TEASER : కేజీఎఫ్ ని మించిన ప్రభాస్ ‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే..!

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న మరో భారీ యాక్షన్ మూవీ సలార్. ఈ  సినిమా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. భారీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదల కానుంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారు. హీరోయిన్ గా  శృతిహాసన్ నటిస్తోంది. తాజాగా సలార్ టీజర్ ని విడుదల చేశారు. 

Advertisement

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న  ఈ మూవీకి సంబంధించిన  టీజర్ ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా రూపొందించారు. కేజీఎఫ్ మాదిరిగానే  హై ఓల్డేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ని మించిపోయేలా పిక్చరైజ్ చేయడం విశేషం.  ముఖ్యంగా టైగర్, చీతా, ఎలిఫెంట్ కంటే వెరీ డేంజరస్ అంటూ హీరో క్యారెక్టర్ ని పరిచయం చేసేవిధంగా ఉన్న టీజర్ చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. చివరిలో హీరో ప్రభాస్ ఇంట్రడక్షన్ తో పాటు విలన్ గా  పృథ్వీరాజ్ సుకుమారన్ అప్పిరియన్స్ లుక్ కేక పుట్టించేవిధంగా కనిపిస్తోంది.  మొత్తానికి కేజీఎఫ్ సిరీస్ లాగే సలార్ ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. ఈ మూవీకి రవిబస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనే చెప్పాలి. మొత్తం ఐదు భాషలకు సంబంధించిన టీజర్ ని అనుకున్నట్టుగానే ఇవాళ ఉదయం 5.12 గంటలకు విడుదల చేశారు.

Advertisement

సలార్ టీజర్ ను జులై 06న ఉదయం 5.12 గంటలకు విడుదల చేయడం వెనుక పెద్ద రీజనే ఉందట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో రాకీభాయ్ ని నేవి అధికారులు ఎటాక్ చేసే సమయంలోనే సలార్ టీజర్ ని విడుదల చేయడం విశేషం.  కేజీఎఫ్ మూవీకి పని చేసిన వారే దాదాపుగా సలార్ సినిమాకు పని చేస్తున్నారు. అందుకే ఆ సమయం ప్రకారంమే సలార్ టీజర్ ని  విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమాకి బిజినెస్ కూడా ప్రారంభం  అయినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఆదిపురుష్ హక్కులు కొనుగోలు చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సహా గీతా ఆర్ట్స్ లాంటి భారీ బ్యానర్ లు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రైట్స్ కి రూ.180 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అనేది ప్రభాస్ కి చాలా కీలకమనే  చెప్పాలి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆచార్య, అంజి తో సహా మెగాస్టార్ కెరీర్ లో డిజాస్టర్ నిలిచిన సినిమాలు ఇవే..!

అల్లు అర్జున్ చెప్పిన ఆ ఒక్క విషయం వల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిందా? అదేంటంటే?

రాజమౌళి తన కెరీర్లో ఇలాంటి అవమానం పొందారా? తన మొదటి సినిమా రిలీజ్ అయ్యాక..?

Visitors Are Also Reading