Adivi Sesh : టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో 2010లో విడుదలైన కర్మ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో పంజా, రన్ రాజా రన్, బలుపు, బాహుబలి వంటి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్ గా చేశాడు. 2016లో క్షణం అనే మూవీ ద్వారా లీడ్ రోల్ పోషించారు.
ఆ తర్వాత ఎవరు, గూడచారి, మేజర్ వంటి వరుస హిట్లతో కాకుండా హిట్ టు సినిమా ద్వారా స్టార్ హీరోగా మారిపోయాడు అడవి శేషు. కాగా గత కొద్ది రోజుల నుండి అడవి శేషు, అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎప్పుడూ వైరల్ అయినా వాటిని అడవి శేషు ఖండిస్తూనే వచ్చాడు.
Advertisement
Advertisement
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అడవి శేషు మరియు సుప్రియ జూన్ 16వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. వీరి పెళ్లికి అక్కినేని కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కాగా, ఆక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ గతంలో సినిమాలు కూడా చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేసిన సంగతి తెలిసిందే.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్!
SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది