Home » రెండో పెళ్లి చేసుకోనున్న సిద్ధార్థ్ !

రెండో పెళ్లి చేసుకోనున్న సిద్ధార్థ్ !

by Bunty
Ad

 

మరోసారి కెమెరా కంట పట్టారు సిద్ధార్థ్, అదితి రావు. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ, డేటింగ్ చేస్తున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా వీరిద్దరూ ఎప్పుడు బయటకు వెళ్లిన కలిసి జంటగా వెళుతున్నారు. సినిమాలకు, ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా ఇద్దరూ కలిసి వెళ్లి అక్కడ సందడి చేస్తున్నారు. ఈమధ్య సిద్ధార్థ్ చెన్నై వదిలి తన ప్రియురాలి కోసం ముంబైలోనే ఉంటున్నాడట. ఇక వీరిద్దరూ ముంబైలో చట్టాపట్టాలేసుకొని తిరిగేస్తూ అభిమానుల కంట పడుతున్నారు.

Advertisement

ఈ మధ్యకాలంలో ఓ ఫేమస్ సాంగ్ కి రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. వీరి ప్రేమ వార్తలపై వీరిద్దరూ ఇప్పటివరకు వాటిని రూమర్స్ అని కొట్టి పారేయలేదు…. అలా అని వారి ప్రేమ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. తాజాగా అదితి నటించిన ఓ సిరీస్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో జూబ్లీ సిరీస్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ వేడుకకు అదితి రావు, సిద్ధార్థ్ మళ్లీ జంటగా కలిసి వచ్చారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి మీడియా ముందు ఫోటోలకి ఫోజులు ఇచ్చారు.

నిజానికి ఈ సిరీస్ కి, సిద్ధార్థ్ కి అసలు సంబంధమే లేదు. కానీ అదితి కోసం వచ్చాడు. వీరిద్దరూ కలిసి జంటగా మహాసముద్రం సినిమాలో నటించారు. అంతకు ముందు నుంచే వీరిద్దరికీ పరిచయం ఉన్నప్పటికీ ఈ సినిమా అనంతరం చాలా క్లోజ్ అయిపోయారు. ఆ సినిమా అనంతరం వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి జంటగా వెళ్లడం, ఇద్దరూ కలిసి ఫోటోలకు దిగడం, షికార్లకు, సినిమాలకు వెళ్లడం వంటివి చేస్తున్నారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నారని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు వారి అభిమానులు. ఇక వీరిద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. మరి వీరి ప్రేమ విషయం కేవలం రూమర్ వరకే పరిమితమా లేకపోతే వివాహం వరకు వెళ్తుందా లేదా చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading