Home » ఆది పురుష్ నుంచి క్రేజీ అప్డేట్…. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జైశ్రీరామ్ సాంగ్..!!

ఆది పురుష్ నుంచి క్రేజీ అప్డేట్…. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జైశ్రీరామ్ సాంగ్..!!

by Bunty
Ad

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో, కృతి సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Advertisement

అయితే ఈ ఇతిహాస చిత్రం ఆది పురుష్ అరుదైన గౌరవం దక్కించుకుంది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. కాగా, రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఆది పురుష్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో జైశ్రీరామ్ అంటూ సాగే లిరికల్ వీడియో మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసి సైలెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది.

Advertisement

READ ALSO : ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త….త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

Adipurush: New Poster Ft. Prabhas, Kriti Sanon & Others Is A Treat For Fans! Makers Stick To Original Release Date Of June 2023

తెలుగు వెర్షన్ ను ఈ చిత్ర హీరో ప్రభాస్ విడుదల చేశారు. ‘ఛార్ దామ్ ను దర్శించుకోలేకపోతే శ్రీరాముని స్మరించుకుంటే చాలు’ అని క్యాప్షన్ ఇస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇటీవల ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

READ ALSO :  Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

Visitors Are Also Reading