Telugu News » 13వ ఏటా పెళ్లి.. వెంటనే విడాకులు..కట్ చేస్తే సమాజం గర్వపడే స్థాయికి ఆదిలక్ష్మి..!!

13వ ఏటా పెళ్లి.. వెంటనే విడాకులు..కట్ చేస్తే సమాజం గర్వపడే స్థాయికి ఆదిలక్ష్మి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత సమాజంలో చాలామంది నాకు అది లేదు నాకు ఇది లేదు. నేను వారిలా ఉంటే ఏదైనా సాధించేవాణ్ణి.. అంటూ పబ్బం గడుపుతూ ఉంటారు.. కృషి పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలమని ఒక్కోసారి కొంతమందిని చూస్తే అర్థమవుతుంది.. నీకు లక్ష్యం సరిగా ఉండాలే కానీ నీకు ఎన్నో దారులు కనిపిస్తాయి. అదే లక్ష్యంపై గురి లేకుంటే పూలధారైన నీకు ముళ్లదారిలాగే అనిపిస్తుంది. అలా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఆవిడకు ఏవి అడ్డు రాలేదు. అన్నింటినీ దిగమింగుకొని మంచి స్థాయికి ఎదిగింది.. మరి అలాంటి ఆదిలక్ష్మి స్టోరీ ఇప్పుడు చూద్దాం.. ఆదిలక్ష్మికి 13 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇక మా పనైపోయిందని చేతులు దులుపుకున్నారు తల్లిదండ్రులు.

also read:Kaikala satyanarayana: కైకాల యమదొంగ మూవీ వదులుకోవడానికి కారణం..!!

Advertisement

Advertisement

కాకినాడకు చెందిన ఆదిలక్ష్మికీ చదువు అంటే చాలా ఇష్టం. తను ఎనిమిదో తరగతిలో ఉండగానే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఆ తర్వాత చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది ఆదిలక్ష్మి. కానీ భర్త, అత్తమామలు అస్సలు కుదరనివ్వలేదు. దీంతో భర్తకు విడాకులు ఇచ్చింది ఆది లక్ష్మి. ఆ తర్వాత ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తూ ఇంటర్ కంప్లీట్ చేసింది. దీని తర్వాత కాకినాడలో ఉన్న ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలాగొలా బీటెక్ కంప్లీట్ చేసింది. ఇంగ్లీష్ సరిగా రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడింది. బీటెక్ లో కూడా మంచి మార్కులు సాధించింది.

ఆ తర్వాత క్యాంపస్ ఎలక్షన్లలో మూడు కంపెనీలు ఆఫర్లు ఇచ్చాయి. కానీ ఆ వైపు వెళ్లకుండా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్ష ప్రిపేర్ అయ్యి ఇండో టిబెట్ పోలీస్ ఫోర్స్ కి ఎంపికైంది. అయినా సంతృప్తి చెందని ఆదిలక్ష్మి నా లక్ష్యం ఇది కాదు మరొకటి ఉందంటూ చెబుతోంది. ఈ విధంగా ఆదిలక్ష్మి సాధించిన విజయానికి ఆమె తల్లిదండ్రులు అత్తమామలు ముక్కున వేలేసుకున్నారు. ఆమె పట్టుదలకు చాలామంది హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆదిలక్ష్మి పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

also read:టాలీవుడ్‌ లో అత్యంత ధనికమైన హీరోలు వీరే

Visitors Are Also Reading