హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్యకాలంలో విపరీతంగా కబ్జాలు జరుగుతున్నాయి. కొంతమంది గుండాలు, గ్యాంగ్ సభ్యులు డబ్బుల కోసం ఆశపడి పడి కబ్జాలు చేసేవారికి సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది… హ***త్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు.అయితే తాజాగా టాలీవుడ్ నటి స్వాతి దీక్షిత్ కూడా కబ్జా వ్యవహారంలో ఇరుక్కుంది. ఇప్పుడు ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
Actress Swati’s attempt to grab a house in Jubilee Hills
అసలు వివరాల్లోకి వెళితే…. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ లో స్థలాలకు అలాగే ఇండ్లకు విపరీతంగా రేటు ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ లోని ఒక ఇంటిని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇల్లు విలువ 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం అందుతుంది. ఎలాగైనా ఆ ఇంటిని కబ్జా చేయాలని పన్నాగంతో… కొంతమంది ఇందులో భాగమై స్కెచ్ వేశారు. కానీ ఇంటి ఓనరు అప్రమత్తం కావడంతో ఈ పన్నాగం బయటపడింది.
Advertisement
Advertisement
వాస్తవానికి జూబ్లీహిల్స్ లో ఉన్న ఇల్లు ఓ ఎన్నారైది. ఆ ఇంటిని లీజుకు ఇచ్చాడు. అయితే ఆ లీజు విషయం లో భాగంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. దీని వెనక ఉన్నది టాలీవుడ్ నటి స్వాతి దీక్షిత్ అని తెలుస్తోంది. ఆమెని కావాలని ఇలా చేయించిందని అంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతోపాటు… 20 మందిపై పోలీసు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!