Home » Mohammed Shami : మహమ్మద్ షమీతో బాలీవుడ్ బ్యూటీ పెళ్లి !

Mohammed Shami : మహమ్మద్ షమీతో బాలీవుడ్ బ్యూటీ పెళ్లి !

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో టీమిండియా సెమీఫైనల్ లకు చేరింది. టీమిండియా సెమీఫైనల్ కు చేరడంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పాత్ర ఎంతో కీలకమైంది. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టీమిండియా తుది జట్టులోకి షమీ వచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు తన భార్యతో వేధింపులకు గురైన మహమ్మద్ షమీ… జట్టులోకి వచ్చాక ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.

Actress Payal Ghosh Marriage Proposal For Mohammed Shami

ప్రతి మ్యాచ్లో నాలుగు వికెట్లకు తగ్గకుండా వికెట్లు తీస్తున్నాడు షమీ. మొదట న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో ఐదు వికెట్లు సాధించిన షమీ… ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు వికెట్లు అలాగే శ్రీలంక జట్టుపై ఐదు వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా పై రెండు వికెట్లు పడగొట్టి.. టాప్ మోస్ట్ వికెట్ టేకర్ గా టోర్నమెంట్ లో నిలిచాడు మహమ్మద్ షమీ. అలాంటి మహమ్మద్ షమీకి బాలీవుడ్ నటి అదిరిపోయే బంపర్ ఆఫర్ అందించింది.

Advertisement

Advertisement

మహమ్మద్ షమీ కి నచ్చితే అతని నేను పెళ్లి చేసుకుంటానని ప్రకటన చేసింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. షమీ… నీ ఇంగ్లీష్ భాష కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించింది. అలాగే సెమీఫైనల్ మ్యాచ్లో నువ్వు ఇరగదీయాలి… అప్పుడు కచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని షరతులు కూడా పెట్టింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్. దీంతో బాలీవుడ్ నటి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading