Home » వాళ్ల చేతిలో దారుణంగా మోస‌పోయిన ల‌య‌…చివ‌రికి డ‌బ్బులు కూడా ఇవ్వ‌కుండా..?

వాళ్ల చేతిలో దారుణంగా మోస‌పోయిన ల‌య‌…చివ‌రికి డ‌బ్బులు కూడా ఇవ్వ‌కుండా..?

by AJAY
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రాణించిన వారిలో హీరోయిన్ లయ కూడా ఒకరు. అందం అభినయంతో లయ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ క‌థ‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం లయ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంటున్నారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ల‌య‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement

ఇంటర్వ్యూలో ల‌య‌ మాట్లాడుతూ… మొదటి నుంచి కూడా తాను చాలా సాఫ్ట్ అని చెప్పారు. అందువల్ల చాలామంది తనకు డబ్బులు ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వాళ్లందరికీ డబ్బులు ఇచ్చేసి తనకు మాత్రం ఇచ్చేవారు కాదని చెప్పారు. దాంతో మీరు కూడా గట్టిగా అడగండి అని మిగతావారు త‌న‌కు సలహా ఇచ్చేవారని అన్నారు. ఒకసారి షూటింగ్ కు రెడీ అయ్యానని… వాళ్లు డబ్బుల విషయంలో ఇబ్బంది పెడుతుండడం వల్ల షూటింగ్ కు వెళ్లలేదని చెప్పారు.

Advertisement

heroine-laya-family

వేరే ఊరు నుండి మా నాన్న ఫోన్ చేస్తే మా అమ్మగారు ఆయనకు ఈ విషయం చెప్పిందని అన్నారు. అంతే ఆయనకు విపరీతమైన కోపం వచ్చి డబ్బులు అడగడంలో తప్పులేదు… కానీ అందుకోసం పని మానేయడం తప్పు అని తిరిగి క్లాస్ పీకారని చెప్పారు. అప్పటినుండి ఇంకెప్పుడూ అలా చేయలేదని అన్నారు.

కొంతమంది డబ్బులు అడిగితే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చూద్దాం అనే వారని ఆ తర్వాత ప్రాజెక్టులో మనల్ని కాకుండా వేరే వారిని తీసుకునే వారని అన్నారు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇస్తారని.. అలాంటప్పుడు మాత్రం కాస్త బాధ కలిగిందని చెప్పారు. అంతేకాకుండా తనపై లేనిపోనివి రాస్తూ యూట్యూబ్ లో ఏవేవో పోస్టులు పెడుతున్నారని వాటిలో ఎంత మాత్రం నిజం లేదని ల‌య‌ వెల్లడించారు.

Visitors Are Also Reading