Telugu News » ఆ స్టార్ హీరో వ‌ల్ల పెళ్లికి దూర‌మైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ఆ స్టార్ హీరో వ‌ల్ల పెళ్లికి దూర‌మైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

by AJAY MADDIBOINA

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు హీరోలతో ప్రేమలో పడటం సాధారణమే. అయితే ఇప్పుడే కాదు ఒకప్ప‌టి నుండి చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే. మరికొందరు మాత్రం అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నారు. అలా ఒకప్పుడు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేక మరొకరితో జీవితాన్ని గ‌డ‌పంటం ఇష్టం లేక ప‌లువురు హీరోయిన్లు పూర్తిగా పెళ్లికి దూరమయ్యారు. ఆ లిస్ట్ లో టబు, నగ్మా లాంటి హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే.

Ads
actress kousalya

actress kousalya

ఇక ఈ లిస్ట్ లో మరో ప్రముఖ హీరోయిన్ కూడా ఉంది. సీనియర్ హీరోయిన్ కౌసల్య కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని గడుపుతోంది. కౌసల్య జగపతిబాబు హీరోగా నటించిన అల్లుడుగారు వచ్చారు సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ కర్నాటకలోని బెంగళూరులో జన్మించింది. మలయాళ ఇండస్ట్రీ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. మలయాళంలో చాలా సినిమాలు చేసిన కౌసల్య తెలుగులోనూ ఎనిమిది సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన పంచదార చిలక సినిమాలో కౌసల్య హీరోయిన్ గా నటించింది.

ALSO READ : ఇది ‘ఛత్రపతి’ ఏంటి ? ‘చపాతీలా’ ఉంది అంటూ బెంగాలీ ఛత్రపతి పై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ..!

actress kousalya

actress kousalya

ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కౌసల్య గ్లామర్ పాత్రలకు దూరంగా అందం అభినయంతో నే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. చూడ్డానికి తెలుగమ్మాయిలా కనిపించి తన నటనతోనూ ఆకట్టుకుంది. కేవలం కథకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే కౌసల్య పెళ్లి కి దూరం అవ్వడానికి ఓ మ‌ల‌యాళ‌ స్టార్ హీరో కారణం అంట.

సినిమాలు చేస్తున్న సమయంలో కౌసల్య స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాడట. అయితే ఆ స్టార్ హీరో ఇంట్లో హీరోయిన్ తో పెళ్లికి నో చెప్పారట. దాంతో ఆ హీరోను మనసులో నుండి తీసివేయ‌లేక మరొకరితో జీవితాన్ని పంచుకోవడం ఇష్టం లేక కౌసల్య ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉన్నారు. ఇక ప్రస్తుతం అత్త, తల్లి పాత్రలతో కౌసల్య సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.


You may also like