Home » భర్త మరణం తరవాత దారుణంగా నటి భానుప్రియ పరిస్థితి…! ఏం జరిగిందంటే…?

భర్త మరణం తరవాత దారుణంగా నటి భానుప్రియ పరిస్థితి…! ఏం జరిగిందంటే…?

by AJAY
Ad

భానుప్రియ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో భానుప్రియ స్టార్ హీరోయిన్ గా రాణించింది. అందమైన కళ్ళు….అంతకంటే అందమైన చిరునవ్వు తో ప్రేక్షకులను ఫిదా చేసింది. చూడ్డానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాించుకుంది. నటన తో పాటు తన నాట్యం తోనూ భానుప్రియ ప్రేక్షకులను అలరించింది.

Advertisement

చాలా కాలం పాటు హీరోయిన్ గా రాణించిన భానుప్రియ ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తింది. అయితే కొంతకాలంగా భానుప్రియ సినిమాలకు దూరంగా ఉంటోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సంచలన కామెంట్ లు చేసింది. తన భర్త మరణించిన తరవాత తనకు మెమరీ లాస్ వచ్చిందని చెప్పింది.

Advertisement

మొదట డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన ఉండేదని కానీ మతిమరుపు కారణంగా నే ఆ ఆలోచన కూడా విరమించుకున్నట్టు తెలిపింది. అంతే కాకుండా డైలాగ్స్ గుర్తు ఉండటం లేదని అందుకే సినిమాల్లో నటించడంలేదని చెప్పింది. ప్రస్తుతం మెడిసిన్ తీసుకుంటున్నట్టు భానుప్రియ స్పష్టం చేసింది. అంతే కాకుండా తన భర్త చనిపోకముందు తనతో విడిపోయినట్టు వార్తలు వచ్చాయని చెప్పింది. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదని…. ఆయన ఇక్కడకి వచ్చేవారు నేను అక్కడికి వెల్లేదాన్ని అని తెలిపింది. అంతే కాకుండా తమకు కూతురు ఉందని ఆమె పేరు అభినయం అని చెప్పింది. ప్రస్తుతం తన కూతురు లండన్ లో చదువుకుంటున్నట్టు తెలిపింది. ఇక తన కూతురుకు సినిమాలపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది.

Also read : బాహుబలి సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

Visitors Are Also Reading