Home » బాహుబలి సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

బాహుబలి సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

by AJAY
Published: Last Updated on
Ad

కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి. అలాంటి సినిమాలలో ఒకటి బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా….. రానా విలన్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా తమన్నా అనుష్క హీరోయిన్ లుగా నటించారు.

Advertisement

ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇక బాహుబలి పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవడంతో బాహుబలి పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. బాహుబలి పార్ట్ 2 సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వడం తో పాటూ 1600 కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Advertisement

ఇక ఈ సినిమాలకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా కథతో రాజమౌళి విజువల్ వండర్ ను సృష్టించారు. ఈ సినిమాను తెరకెక్కించేందుకు రాజమౌళి సైతం చాలా కష్టపడ్డారు. సినిమాలో చిన్నచిన్న విషయాలపై కూడా రాజమౌళి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ విషయం సినిమా చూస్తే మనకే అర్థమవుతుంది. అయితే ఈ చిత్రంలో రానా నుదుటి పై ఓ గాయం కనిపిస్తుంది. పార్ట్ 2 లో మనకు ఆ గాయం కనిపిస్తుంది. అయితే ఆ గాయం ఎలా వచ్చింది అన్న విషయం చాలామంది గుర్తించరు.

అయితే ఈ సినిమా పార్ట్ 1 లో కుమార్ వర్మ తనపై దాడి చేయడానికి వచ్చినట్టు నమ్మించేందుకు రానా తనకు తానే కత్తితో నుదుటిపై గాయపరచుకుంటాడు. ఇక దాన్నే పార్ట్ 2 లో రాజమౌళి మిస్ కాకుండా చూపించాడు. అందువల్లే పార్ట్ 2 లో కూడా జక్కన్న రానా నుదిటి పై కత్తి గాట్లు కనిపించేలా చేశాడు. అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాడు కాబట్టే రాజమౌళి ఇండియా లోనే ఒక బ్రాండ్ డైరెక్టర్ అయ్యాడు.

Also read : Taraka ratna : తారకరత్న ట్రీట్మెంట్ కు లక్షల్లో ఖర్చు…ఎవరు భరిస్తున్నారు తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading