సినిమాల్లోకి వచ్చాక.. ఒక సినిమా కోసం ఎంత దూరం అయినా వెళ్లాల్సి ఉంటుంది. ఒక సినిమాలో తమ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి నటులు చాలా కష్టపడుతుంటారు. ఒక్కోసారి తమకు ఎంతో ఇష్టమైన ఫుడ్ ని కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. తమకు కష్టమైనా షెడ్యూల్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అన్నిటికి సిద్ధపడి కష్టపడితేనే పాపులారిటీ వస్తుంది. ఇలా సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
1. అక్కినేని నాగార్జున:
అక్కినేని నాగార్జున సాయిబాబా గా నటించిన సినిమా “శిరిడి సాయి”.ఈ సినిమాలో నాగార్జున బాబాగా నటించడంతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు నాన్ వెజ్ ముట్టుకోలేదు. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు.
2. అల్లు అర్జున్:
అల్లు అర్జున్ ప్యూర్ వెజిటేరియన్ గా, పక్కా బ్రాహ్మణుడిగా దువ్వాడ జగన్నాధం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించినన్ని రోజులు అల్లు అర్జున్ నాన్ వెజ్ తినకుండా ఉన్నారట. బ్రాహ్మణులను గౌరవిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
3. పవన్ కళ్యాణ్:
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీతమ్’ కు రీమేక్ గా “బ్రో” సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కాల దేవుడిగా కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ ముట్టుకోనని పవన్ నిర్ణయం తీసుకున్నారు.
4. రణదీప్ హుడా:
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ అనే సినిమాలో నటించడం కోసం నాన్ వెజ్ ను పక్కన పెట్టారు.
Advertisement
5. పరిణితి చోప్రా:
బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ‘కోడ్ నేమ్ తిరంగ’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కోసం పరిణితి నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు.
6. అక్షయ్ కుమార్:
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఓ మై గాడ్ 2 మూవీ లో నటిస్తున్నారు. ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా కొనసాగుతోంది. ఈ సినిమాలో అక్షయ్ కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారు. అందుకే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
7. రిషబ్ శెట్టి:
కాంతారా మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. దైవ కోలా సీక్వెన్స్ షూటింగ్ మొదలవడానికి ఇరవై రోజుల ముందు నుంచే రిషబ్ శెట్టి నాన్ వెజ్ మానేశారట.
8. సీనియర్ ఎన్టీఆర్:
శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు లను తలుచుకుంటే ముందు కళ్ళల్లో మెదిలేది ఎన్టీ రామారావు గారి రూపమే. తన కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో నటించినంత కాలం ఎన్టీఆర్ నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. ఎంతో నిష్టగా ఆయన ఆ పాత్రలను పోషించారట.
పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?
ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?