Home » పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూర్ణ..తన భర్త ఎంత పెద్ద బిజినెస్ మేన్ అంటే..?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూర్ణ..తన భర్త ఎంత పెద్ద బిజినెస్ మేన్ అంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పూర్ణ.. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఆమె బుల్లితెరపై రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ విధంగా తన కెరీర్ లో దూసుకుపోతున్న పూర్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నది. ఇప్పటికే ఆమె ఎంగేజ్మెంట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరి పూర్ణ చేసుకోబోయే అబ్బాయి ఎవరు.. ఆయన ఏం చేస్తారు.. ఓ సారి చూద్దాం..?

పూర్ణ చేసుకోబోయే అబ్బాయి పేరు షానిద్ అసిఫ్ యుఎస్ఎలో పెద్ద వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ కంపెనీ మొదలుపెట్టాడు. ఆ కంపెనీకి సీఈవో, ఫౌండర్ నెంబర్. కొత్త కంపెనీలు స్థాపన మరియు వాటి ఆఫీసులో కావలసినటువంటి ఫర్నిచర్ ఇతర అవసరాలను అందించడంలో పాటుగా వీసా కు సంబంధించిన ప్రాసెసింగ్, ఫ్లైట్ టికెట్ లాంటి సర్వీసులను అందిస్తుంది ఈ కంపెనీ. గత కొన్ని ఏళ్లుగా ఈ బిజినెస్ లో ఎంతో సంపాదించారు ఆయన.

Advertisement

Advertisement

జామ హాలీమెహరి అనే సంస్థను కూడా స్థాపించారు. ఇది ఎన్నో ముఖ్యమైన సర్వీసులను అందిస్తోంది. సీమటపాకాయ్ సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్న పూర్ణ ఆ తర్వాత అంతగా రాణించలేక పోయింది. టాలెంట్ ఉన్న నటిగా పేరు దక్కించుకున్న ఈ మలయాళీ భామకు ఇండస్ట్రీలో అదృష్టం కలిసిరాలేదని చెప్పవచ్చు. ఆమె బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీలో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

పూర్ణ గతకొద్దికాలంగా బుల్లితెరపై బిజీగా ఉంటుంది. డాన్స్ రియాలిటీ షో డీ లో పూర్ణ జడ్జిగా వ్యవహరించింది. ఆమె ఇచ్చిన జడ్జిమెంట్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఆ తర్వాత చిన్న చిన్న శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ లాంటి షోలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోంది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి పనుల్లో బిజీగా ఉందని సమాచారం.

also read;

కేకే ముఖం, తలపై గాయాలు.. అసలు విషయం పోస్టుమార్టంలో..?

వెన్నెల కిషోర్ సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేసేవారో తెలుసా..?

 

Visitors Are Also Reading