Home » వెన్నెల కిషోర్ సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేసేవారో తెలుసా..?

వెన్నెల కిషోర్ సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేసేవారో తెలుసా..?

by Sravanthi
Ad

వెన్నెల కిషోర్ పేరు వింటేనే నవ్వొస్తోంది కదూ. ఆయన కమెడియన్స్ లోనే చాలా వెరైటీ కామెడీ చేస్తూ , తన ముఖ హావభావాలతోనే అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి విలక్షణ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో ఆయన ఉండటం గమనార్హం. ఆయన ఇప్పటివరకు సీమటపాకాయ్, దూకుడు, పిల్ల జమిందార్, బిందాస్ లాంటి చిత్రాలలో చేసి జనాన్ని కడుపుబ్బ నవ్వించారు. ఆయన తొలి సినిమా వెన్నెల. ఈ సినిమాలో అక్క కొంచెం జరగవా ప్రపంచం కనబడట్లేదు అనే కామెడీతో అందరికీ గుర్తుండి పోయాడు. దీంతో అతని ఇంటిపేరు వెన్నెల గా మారిపోయింది.

Advertisement

ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలు అనేవి నేను ఎప్పుడు నటిస్తాను అనుకోలేదు. అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. కానీ అనుకోకుండా నేను ఇన్ని సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చాడు. ఆయన జీవితం గురించి కూడా చెప్పారు. వెన్నెల కిషోర్ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాన్న లక్ష్మీ నారాయణ ఇంగ్లీష్ టీచర్. నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడే ఆయన రిటైర్ అయ్యారు. నాకు ఆరుగురు అక్కలు. నాకు ఊహ తెలిసేసరికి వారందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నా చిన్నతనంలో ఇంట్లో నాన్న నాకు పాఠాలు చెప్పేవారు.

Advertisement

నర్సరీ ఎల్కేజీ అన్ని వదిలేసి నేరుగా నన్ను మూడో తరగతిలో వేశారని కామెడీ గా చెప్పారు. ఈ విధంగా ఆయన పదో తరగతి పూర్తిచేశారు. ఆ తరువాత బీకాం పూర్తి చేసి అమెరికా వెళ్లారు. అక్కడికి వెళ్లాలంటే ఇండియాలో కనీసం 16 సంవత్సరాలు చదువు పూర్తి చేసి ఉండాలి. నా చదువు అంతగా లేకపోవడంతో ఏడాదిన్నర పాటు ఒక కోర్సు చేశా. ఈ విధంగా అమెరికా వెళ్ళాను. అలా ఇన్ని సంవత్సరాలు యూఎస్ లో జాబ్ చేసాను. ఈ తరుణంలోనే ఒకసారి తెలుగు సినిమా డాట్ కాం లో వెన్నెల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలని అడిగితే అప్లై చేశాను. తర్వాత దేవా కట్ట తో ఫోన్లో మాట్లాడి అతన్ని కలవడానికి న్యూజెర్సీ వెళ్ళాను.

నా వర్క్ చూసి తను తన టీమ్ లోకి తీసుకున్నారు. అసలు వెన్నెల్లో నేను చేసిన క్యారెక్టర్ శివారెడ్డి గారు చేయాలి. ఆయనకు వీసా ప్రాబ్లం రావడంతో దాన్ని నేను చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశానని అన్నారు. సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక చాలా నేర్చుకున్నానని పెద్దపెద్ద యాక్టర్స్ పక్కన చేసే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పారు.ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆయన భార్య పేరు పద్మజ. ఆమె మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తుందట. ఈ విధంగా వెన్నెల కిషోర్ గారు సినీ లైఫ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ALSO READ;

అక్కినేని ఫ్యాన్స్ కు షాక్…నాగార్జున ప్లేస్ లోకి స‌మంత‌…?

“ఏఎన్ఆర్” నాగార్జునను హీరో చేయడానికి కారణం చిరంజీవి అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు గీతాకృష్ణ..?

 

Visitors Are Also Reading