Home » రెండో పెళ్లి గురించి న‌టుడు బ‌బ్లూ పృథ్విరాజ్ ఏమన్నారంటే ?

రెండో పెళ్లి గురించి న‌టుడు బ‌బ్లూ పృథ్విరాజ్ ఏమన్నారంటే ?

by Anji
Ad

న‌టుడు బ‌బ్లూ పృథ్విరాజ్ గురించి ప్ర‌త్యేకంగా పరిచయం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తొలుత చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ త‌రువాత విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న పృథ్విరాజ్ ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ లో న‌టిస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా పృథ్వీ రెండో పెళ్లి చేసుకున్నారంటూ సోష‌ల్ మీడియాలో తెగ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. గత కొంతకాలంగా ఆ వ్యక్తిగత జీవితం పై వస్తున్న వార్తలపై తాజాగా ప్రముఖ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ స్పందించారు. తన ప్రియురాలు శీతల్ తో కలిసి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. పలు ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.

Advertisement

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “చాలామంది ఒక ముసలివాడు.. యువతి అని ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు 100 ఏళ్ళు ఉన్నట్టు ఆమెకు 16 ఏళ్లు ఉన్నట్టు.. కూతురు వయసు ఉన్న పిల్లలతో పెళ్లి సిగ్గు లేదా అని ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి శీతల అనే అమ్మాయితో నేను రిలేషన్ లో ఉన్నాను. నాకు 57 ఏళ్లు.. శీతల్ కి 24 సంవత్సరాలు. మేము ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. నా మొదటి భార్య బీనాతో గొడవ కారణంగా బయట ఉంటున్నాను. ఈ సమయంలోనే శీతల్ నాకు పరిచయమైంది. ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నన్ను పెళ్లి చేసుకోవాలని సీతలే చెప్పింది. మొదట నేను పెళ్లికి నేను ఒప్పుకోలేదు. బాగా ఆలోచించుకోవాలని కాస్త సమయం ఇచ్చాను. ఆమె ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు ” అని చెప్పుకొచ్చారు పృధ్విరాజ్.

Advertisement

Also Read :  అభిమానులని ఆశ్చర్య పరిచిన సమంత..!


మరోవైపు శీతల్ మాట్లాడుతూ.. “నేను ఆంధ్ర యువతిని. మలేషియా యువతని కాదు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. మేమిద్దరం తొలిసారిగా బెంగళూరులో ఓ రెస్టారెంట్ లో కలిశాం. అప్పుడు నేను ఐటీ కంపెనీలో పని చేస్తుండే దాన్ని. తొలుత పృథ్వి నీ నేను గుర్తు పట్టలేదు. తెలుగులో నువ్వు నాకు నచ్చావు సినిమా ఉంది నేను ఆయనను పదేపదే చూశాను. అప్పుడు సినిమాలోని ఆయన షర్టు గుర్తుకొచ్చింది. అలా ఆయనను గుర్తుపట్టాను. నేను నా ఫ్రెండ్ సెల్ఫ్ తీసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాము. అప్పుడే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరం తీసుకోన్నాము. ఆ తర్వాత మా మధ్య స్నేహము పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది” అని చెప్పుకొచ్చింది.

Also Read :  “కాంతారా”లో పంజర్లి దేవత ఎవరు..ఆ ఆచారం ఎలా వచ్చిందంటే..?

Visitors Are Also Reading