ఒకప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజబాబు కూడా ఒకరు. ప్రస్తుతం బ్రహ్మానందంకు ఏం రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అప్పట్లో రాజబాబుకు సైతం అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉండేది. రాజబాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు అప్పటి స్టార్ హీరోలు అందరి సినిమాల్లోనూ రాజబాబు నటించారు. అంతే కాకుండా రాజబాబు రోజులో 20 గంటల పాటూ షూటింగ్ లోనే గడిపిన రోజులు కూడా ఉన్నాయి.
Also Read: “సలార్” క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందా..గూస్ బంప్స్ తెప్పించే లేటెస్ట్ అప్డేట్..!!
Advertisement
ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మరియు కృష్ణ లాంటి స్టార్స్స్ సినిమాలలో నటించిన ఒకే ఒక కమెడియన్ కూడా రాజబాబు గారే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. రాజబాబు ఏపీలోని రాజమండ్రిలో జన్మించాడు. నటన పై ఉన్న ఆసక్తితో మొదట ఆయన నాటకాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తరవాత సినీరంగ ప్రవేశం చేశారు. రాజబాబు 1960వ సంవత్సరంలో సమాజం అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.
Also Read: ఇప్పటికి నెం 1గా ప్రభాస్..!
Advertisement
కానీ మొదటి సినిమాతో రాజబాబుకు సరైన బ్రేక్ రాలేదు. ఇక 1962లో ఆయన నటించిన భీష్మ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఇదిలా ఉంటే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే రాజబాబు 1980 సంవత్సరంలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే రాజబాబు సినిమాల గురించి ప్రేక్షకులకు తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. రాజబాబు లక్ష్మి అమ్ముల అనే మహిళను వివాహం చేసుకున్నారు.
వీరికి నాగేంద్ర బాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కాగా రాజబాబు 1980 సంవత్సరంలో మరణించడంతో ఆయన కుటుంబం విషాదం లోకి వెళ్లిపోయింది. ఇక రాజబాబు ఇద్దరు కుమారులు చదువులు పూర్తిచేసిన తరావత అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే సాఫ్ట్ వేర్ కంపెనీలను సైతం స్థాపించి స్థిరపడ్డారు. అంతే కాకుండా ప్రస్తుతం మన ఉపయోగిస్తున్న జీపీఆర్ ఎస్ సిస్టమ్ వారి కంపెనీ నుండే పనిచేస్తుందని సమాచారం. అదేవిధంగా అమెరికాలో ప్రభుత్వ రంగ సంస్థలకు సైతం రాజబాబు కుమారుల కంపెనీలు పనిచేస్తున్నాయట. ఇక రాజబాబు సినిమా రంగంలో రానిస్తే ఆయన కుమారులు సాఫ్ట్ వేర్ రంగంలో రానిస్తున్నారు.
Also Read: విజయ్ జన గణ మన స్టార్ట్ అయ్యిందా..?