Home » విజయ్ జన గణ మన స్టార్ట్ అయ్యిందా..?

విజయ్ జన గణ మన స్టార్ట్ అయ్యిందా..?

by Azhar
Ad
టాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలతోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక్కడ తెలుగులో వరుస హిట్స్ అనేవి రావడం.. అదే సమయంలో తెలుగులో పాన్ ఇండియా స్టైల్ రావడంతో.. విజయ్.. కూడా పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ పేరుతో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా అనేది పెద్ద డిజాస్టర్ గా మారిపోయింది.
అందువల్ల విజయ్ నుండి కొత్తగా వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే విజయ్ కొత్త సినిమా కూడా మళ్ళీ పూరి డైరెక్షన్ లోనే జన గణ మన అనే పేరుతో వస్తుంది. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా విజయ్ కనిపించాల్సి ఉంది. కానీ లైగర్ ప్లాప్ తర్వాత ఈ సినిమా అనేది ఆగిపోయింది. కానీ తాజాగా విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అందువల్ల ఆగిపోయింది అనుకున్న జన గణ మన అనే సినిమా మళ్ళీ ప్రారంభం అయ్యిందా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కానీ కాలేదు. ఎందుకంటే వైరల్ అవుతున్న ఆ ఫోటో అనేది సినిమాకు సంబంధించింది కాదు. ప్రస్తుతం జై జవాన్ కార్యక్రమంలో విజయ్.. బారాముల్లాలోని యూరీ సెక్టార్ వద్ద భారత సైనికులను కలిసాడు. అక్కడ వారిని కలిసిన సమయంలోనే విజయ్.. ఆర్మీ డ్రెస్ అనేది వేసుకొని వారితో ఫోటో దిగాడు.

Advertisement

Visitors Are Also Reading