Home » నేడు సీఎం జ‌గ‌న్ తో టాలీవుడ్ స్టార్స్ భేటీ..గుడ్ న్యూస్ చెబుతారా..!

నేడు సీఎం జ‌గ‌న్ తో టాలీవుడ్ స్టార్స్ భేటీ..గుడ్ న్యూస్ చెబుతారా..!

by AJAY
Ad

ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. టికెట్ల ధ‌ర‌ల‌పై ఏపీ స‌ర్కార్ నియంత్ర‌ణ విధించ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు దీనిని వ్య‌తిరేఖిస్తున్నారు. ఏపీ స‌ర్కార్ అవ‌లంభిస్తున్న దోర‌ణితో పెద్ద సినిమాలు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్ ఓ మెట్టు కింద‌కు దిగింది. సీఎం జ‌గన్ ఏపీ టికెట్ల అంశంపై చ‌ర్చించేందుకు చిరంజీవికి ఆహ్వానం ప‌లికి ఇప్ప‌టికే చ‌ర్చించారు. ఈ స‌మావేశం అనంత‌రం సీఎం జ‌గ‌న్ స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్కారినికి పాజిటివ్ గా స్పందించార‌ని తెలిపారు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

అంతే కాకుండా ఓ క‌మిటి వేస్తామ‌ని సీఎం తెలిపార‌ని మ‌రోసారి మీటింగ్ ఉంటుంద‌ని చిరు పేర్కొన్నారు. ఇక చిరంజీవి చెప్పిన‌ట్టుగానే నేడు సీఎం జ‌గ‌న్ తో ప‌లువురు సినీప్ర‌ముఖులు భేటీ అవుతున్నారు. ఈ రోజు ఉద‌యం 11గంట‌ల‌కు చింరంజీవితో పాటూ హీరోలు నాగార్జున‌, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు మ‌రియు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, కొర‌టాల శివ ఈ సమావేశానికి హాజ‌రుకానున్నారు. అయితే ఇప్ప‌టికే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సీఎం జ‌గ‌న్ పాజిటివ్ గా ఉన్నారని చిరు చెప్పిన నేప‌థ్యంలో సీఎం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

Visitors Are Also Reading