Hero Nani Parents: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వారసత్వంగా వచ్చి సెటిల్ అవుతారు. వారి తండ్రులు, తాతలు ఇలా ఏదో ఒక వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోల్లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
చందమామ సినిమాలో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. రీసెంట్ గా నాని శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా నాని కేవలం కమర్షియల్ సినిమాలకు ఫిక్స్ అవ్వకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
Advertisement
Advertisement
దాంతో నానికి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఎదిగిన నాని తల్లిదండ్రులను చూస్తే… వాళ్లు ఏం చేస్తారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. నాని తల్లి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని కాగా నాని తండ్రి కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు. నాని కెరీర్లో స్థిరపడటానికి వీరిద్దరూ ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నాని స్టార్ హీరో గా ఉన్నారు.
కోట్ల ఆస్తులు సంపాదించారు. అయినప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేయడం విశేషం. నాని తల్లి ఇప్పటికీ నడుచుకుంటూ తన ఉద్యోగానికి వెళుతుంటారు. కొడుకు నుండి ఆశించకుండా ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో ప్రతి ఒక్కరు వీరిని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక నాని కూడా సొంత కష్టంతో స్టార్ అయిన సంగతి తెలిసిందే. దాంతో నానికి తల్లిదండ్రుల నుండే కష్టపడే తత్వం వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇవి చదవండి :
ఆ లాజిక్ నిజమే అయితే “ఆచార్య” కూడా ప్లాప్ అవుతుందంట ! ఎలాగంటే?
సరదాగా పబ్ కు వెళ్లడం అలవాటే కానీ ఆ పని చేయను…హేమ సంచలన వ్యాఖ్యలు…!
చిరంజీవిపై అనసూయ ఆసక్తికర ట్వీట్..!