Home » HEMA : సర‌దాగా ప‌బ్ కు వెళ్ల‌డం అల‌వాటే కానీ ఆ ప‌ని చేయ‌ను…హేమ సంచల‌న వ్యాఖ్య‌లు…!

HEMA : సర‌దాగా ప‌బ్ కు వెళ్ల‌డం అల‌వాటే కానీ ఆ ప‌ని చేయ‌ను…హేమ సంచల‌న వ్యాఖ్య‌లు…!

by AJAY

ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన ప‌బ్ గ‌బ్బు ఇష్యూలో హేమ పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లోని ఓ ప‌బ్ లో పార్టీ జ‌ర‌గ్గా ఆ పార్టీలో సెలబ్రెటీలు రాహుల్ సిప్లింగజ్, నిహారిక తో పాటూ మ‌రి కొంద‌రు అర్ధ‌రాత్రి దాటాక ప‌బ్ లో ఉండ‌టంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. పార్టీలో డ్ర‌గ్స్ కూడా ల‌భించ‌డంతో రెండు మూడు రోజులు ఇదే వార్త సెన్సేష‌న‌ల్ అయ్యింది. ఆ త‌ర‌వాత ఈ వార్త నీరుగారిపోయింది.

Actress Hema

ఇక ఈ పబ్ ఇష్యూలో న‌టి హేమ పేరు కూడా వార్త‌ల్లో వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో హేమ పోలీసు స్టేష‌న్ కు వెళ్లి మీడియా ముందుకు వ‌చ్చి క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా హేమ్ ప‌బ్ ఇష్యూ పై ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. త‌న‌కు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్ట‌మ‌ని తెలిపింది. కానీ విస్కీ, మందు తాగే అల‌వాటు లేద‌ని చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కూ డ్ర‌గ్స్ ను చూడలేద‌ని చెప్పింది.

Hema

Hema

మొన్న ప‌బ్ ఇష్యూలో త‌న‌ను అన‌వ‌స‌రంగా ఓ జ‌ర్న‌లిస్ట్ లాగార‌ని హేమ తెలిపింది. ఆ జ‌ర్న‌లిస్ట్ కు ఫోన్ చేసినా కూడా తీయ‌లేద‌ని చెప్పింది. దాంతో తాను పోలీసులను ఆశ్ర‌యించాన‌ని పేర్కింది. ఎస్సై జ‌ర్నలిస్ట్ కు ఫోన్ చేస్తే రాంగ్ నంబ‌ర్ అంటూ పెట్టేశార‌ని చెప్పింది. ప్ర‌ముఖ ఛాన‌ల్ లో త‌న పేరు రావ‌డంతోనే పుకార్లు వ‌చ్చాయ‌ని తెలిపింది.

ఆ జ‌ర్న‌లిస్ట్ పై ఛాన‌ల్ పై తాను ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని హేమ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా హేమ టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నో సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. త‌ల్లి అత్త లాంటి పాత్ర‌లు చేస్తూ అభిమానుల‌ను సంపాదించుకుంది.

Visitors Are Also Reading