Home » ఆ లాజిక్ నిజమే అయితే “ఆచార్య” కూడా ప్లాప్ అవుతుందంట ! ఎలాగంటే?

ఆ లాజిక్ నిజమే అయితే “ఆచార్య” కూడా ప్లాప్ అవుతుందంట ! ఎలాగంటే?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించారు.

Advertisement

సినిమాలో రామ్ చరణ్ పాత్ర 30 నిమిషాలకు పైగానే ఉంటుందని కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే.

radhe shyam

radhe shyam

మరోవైపు రామ్ చరణ్ కు జోడీగా సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలను విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం మెగా అభిమానులను ఓ విషయం ఆందోళనకు గురి చేస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రీసెంట్ సినిమా రాధే శ్యామ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయ్యింది.

Advertisement

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మరో సినిమా బీస్ట్. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలోని అరబిక్ కుత్తు పాట ఎంతో పాపులర్ అయింది.

ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య తమిళ్ ,తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైంది. ఇక ఈ సినిమా మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మెగాఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సినిమాల్లో పూజాహెగ్డే పాయింట్ కాగా ఇప్పుడు ఆచార్య లోను పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దాంతో ఆచార్య రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు. మరి ఆచార్య సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

ఇవి చ‌ద‌వండి :

మెగా డాటర్స్ ను శాపం వెంటాడుతోందా….ఈ కష్టాలకు కారణం ఏంటి….?

అప్పట్లో ఆ హీరోతో మంచి రిలేషన్ ఉండేదని షాకింగ్ నిజాలు చెప్పిన రాములమ్మ..!

Visitors Are Also Reading