Home » రూ.500 నోట్లు రద్దు.. ఆర్‌బీఐ త్వరలోనే ప్రకటన చేయనుందా ?

రూ.500 నోట్లు రద్దు.. ఆర్‌బీఐ త్వరలోనే ప్రకటన చేయనుందా ?

by Anji
Ad

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రూ.2000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. వాడుకలో పెద్దగా కనిపించి రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి సమస్య తలెత్తదని ఆర్బీఐ భావించింది. ఇప్పుడు అక్కడే రెండు కొత్త సమస్యలు తలెత్తాయి. ఒకటి రూ.500 నోట్ల కొరత, రెండోది రూ.500 నోట్లు నకిలీవి మార్కెట్ లోకి రావడం. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్ల కన్నా ఎక్కువగా 20 శాతం నకిలీ నోట్లు ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించడం గమనార్హం. 

Advertisement

ప్రస్తుతం రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో భారీగానే డిపాజిట్ అవుతున్నాయి. ఎస్బీఐలో ఇప్పటివరకు రూ.17వేల కోట్లకు పైగా వచ్చినట్టు సమాచారం. ఇక ఇప్పటివరకు పెద్ద నోట్లను దాచుకున్న వారు వాటిని మార్చుకొని రూ.500 నోట్లను తీసుకుంటున్నారు. వాటిని కూడా దాచేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకు వేల కోట్ల రూ.500 నోట్లు మాయం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా జరగడం వల్ల రూ.500 నోట్లకు కొరత ఏర్పడుతుంది. చలామణిలో సరిపడా నోట్లు లేకపోతే అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. ధరలు పెరిగి ద్రవ్యల్బోణం మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు రూ.2000 నోట్లను ఉపసంహరించిన తరువాత రూ.500 నోట్లకు భారీగానే డిమాండ్ పెరిగింది. 

Advertisement

ఇదే అనుకూల సమయం అనుకొని నకిలీ నోట్లను మార్కెట్ లోకి విచ్ఛలవిడిగా తీసుకొస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రూ.500 నకిలీ నోట్లు భారీగానే పెరిగిపోయాయి. కొన్ని నివేదికల ప్రకారం.. పొరుగుదేశం పాకిస్తాన్ లో ముద్రించి నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. నకిలీ నోట్లు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ పట్ల నమ్మకం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు రూ.500 నోట్లను సైతం రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే రూ.500 నోట్లను ఆర్బీఐ రద్దు చేయనుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పలువురు ఆర్థిక నిపుణులు మాత్రం రూ.500 రద్దు చేయడం మంచిది అని సూచిస్తున్నారు. ఇటీవల టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు కూడా రూ.500 నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి సూచించడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన సినిమాల గురించి మీకు తెలుసా ?

దర్శనం తర్వాత గుడి మెట్ల పై ఎందుకు కూర్చోవాలి..? దాని వెనక ఉన్న అర్థం ఏంటి..?

Visitors Are Also Reading