Home » Bigg Boss 6 : బిగ్‌బాస్ 6లో మెర‌వ‌నున్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ..!

Bigg Boss 6 : బిగ్‌బాస్ 6లో మెర‌వ‌నున్న జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ..!

by Anji
Ad

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ షో తెలుగు, హిందీతో పాటు భాష‌ల్లో విజ‌య‌వంత‌మైంది. ఇప్ప‌టికే ఈ షోకు బుల్లితెర ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. ఈ త‌రుణంలో రెస్పాన్స్ అందుకుంటున్న ఈ షో సీజ‌న్ బై సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఈ త‌రుణంలోనే బిగ్‌బాస్ కంటిస్టెంట్స్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతూ షోని నిర్వ‌హ‌కులు ర‌క్తి క‌ట్టిస్తున్నారు.

Advertisement

సెల‌బ్రిటీలంద‌రినీ ఒకేచోట చేసే అవ‌కాశంతో పాటు వారి ఆట, పాట‌, ఎంజాయ్ మూవ్‌మెంట్స్ అన్నీ కలిపిస్తున్న ఈ షో తెలుగులో ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా 5 సీజ‌న్లు పూర్తి చేసుకున్న‌ది. ఇటీవ‌ల బిగ్‌బాస్ 5 పూర్త‌వ్వ‌డంతో ప్ర‌స్తుతం 6వ సీజ‌న్ కోసం ఏర్పాట్ల‌న్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌బ‌ర్ద‌స్త్ షోతో ఫుల్ పాపుల‌ర్ అయిన వ‌ర్ష‌ను ఈసారి బిగ్‌బాస్ హౌస్‌కి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్ష‌కు ఇదివ‌ర‌కే సీజ‌న్ -5 బిగ్ బాస్ నాన్‌స్టాప్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే అవ‌కాశం వ‌చ్చింద‌ని విన్నాం. కొన్ని కార‌ణాల మూలంగా ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టలేద‌నే టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement

ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్‌-6లో మాత్రం క‌చ్చితంగా వ‌ర్ష రియ‌ల్ టైమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండాల‌ని నిర్వ‌హ‌కులు ఫిక్స్ అయ్యార‌ట‌. ఇక వ‌ర్ష‌తో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌నే టాక్ కూడా వినిపిస్తోంది. గ‌తంలో పోల్చితే బిగ్‌బాస్ సీజ‌న్‌-6 మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండాల‌ని స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకోసం నిర్వ‌హ‌కులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఇక ఈసారి బిగ్‌బాస్ కంటిస్టెంట్స్ వీళ్లే అంటూ కొంద‌రి పేర్లు సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష పేరు బ‌య‌ట‌కు రావ‌డం బుల్లితెర ఆడియ‌న్స్‌లో కుతుహ‌లం పెంచుతోంది.

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం రీసెంట్‌గా నాగార్జున ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిన‌దే. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా వ‌దిలారు. ఇన్ని రోజులు బిగ్‌బాస్ షో చూశారు ఆనందించారు. కానీ మీరు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాల‌నుకుంటున్నా క‌దూ.. అందుకే స్టార్ మా ఇస్తుంఇ ఆకాశాన్ని అందుకునే అవ‌కాశం. వ‌న్ టైమ్ గోల్డెన్ ఆఫ‌ర్‌. టికెట్ టూ బిగ్‌బాస్ సీజ‌న్ 6 అంటూ జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌కి ఆఫ‌ర్ ఇచ్చారు నాగార్జున‌. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో స‌ద‌ర‌న్ ప‌బ్లిక్‌తో పాటు కొంత మంది సెల‌బ్రిటీలు భాగం అయ్యేవిధంగా నిర్వ‌హ‌కులు స్కెచ్ వేశార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇక త్వ‌ర‌లోనే వీటికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Also Read :

వాహ‌నాల టైర్లు న‌లుపు రంగులో ఉండ‌డానికి కార‌ణం ఏమిటో మీకు తెలుసా..?

వెన్నెల కిషోర్ సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేసేవారో తెలుసా..?

 

Visitors Are Also Reading