ఆన్ లైన్ గేమ్స్ గురించి తెలియని వారు చాలా తక్కువ మందే ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతుంది. ఇక ఆన్ లైన్ గేమ్ లు ఎంత డేంజర్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆన్ లైన్ గేమ్స్ లో బానిస అయితే ఇక రొంపిని తప్పించుకోవడం చాలా కష్టం. అలా ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అయిన ఓ మహిళ చివరకు తనను తానే పందెం కాసింది. తన శరీరం మీదనే పందెం కాసి తనను తానే పోగుట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్ జిల్లాకు చెందిన రేణు అనే మహిళ గురించే మనం మాట్లాడుకునేది. రేణు భర్త గత ఆరు నెలల కింద పని పని కోసం రాజస్థాన్ వెళ్లాడు. పని చేస్తూ వచ్చిన డబ్బులను తన భార్యకు పంపించేవాడు. ఇంటి దగ్గర పిల్లలతో ఉండే రేణు స్మార్ట్ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. టైమ్ పాస్ చేసేది. ఆ టైమ్ పాస్ కాస్త సీరియస్ తాను ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అయిపోయింది. బెట్టింగ్ లో డబ్బులను పెట్టి చాలా పోగొట్టుకుంది. ఏం చేయాలో అసలు రేణుకు అర్థం కాలేదు.
Advertisement
Also Read : అతిపిన్న వయసులోనే ఫిఫాలో 9 గోల్స్.. పీలే రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరంటే?
తాను అద్దెకు ఉండే ఇల్లు యజమానితో ఒక రోజు లూడో గేమ్ ఆడింది. లూడో గేమ్ ఆడుతూ.. మొత్తం పోగొట్టుకొని చివరికీ తనపై తానే పందెం కాసింది. తనపై తాను పందెం కాసినా కూడా ఆటలోనూ ఓడిపోయింది రేణు. దీంతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ ఇంటి యజమాని. ఆ యజమాని ఏం చేస్తాడో అని భయపడి వెంటనే తన భర్తకు జరిగిన విషయం చెప్పింది. వెంటనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.