తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష అంటే తెలియని వారు ఉండరు. నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై చిన్నది ఎప్పుడు అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. తెలుగులో ఒక ఊపు ఊపిన త్రిష ఇక్కడ ఛాన్సులు తగ్గిపోవడంతో తమిళంలో తన సత్తా చాటుతూ వచ్చింది.
Advertisement
Ad
also read:కృష్ణతో కలిసి అల్లూరిసీతారామరాజు సినిమా చూసిన ఎన్టీఆర్..! ఆ తరవాత ఏం అన్నారో తెలుసా..?
తాజాగా విడుదలై సూపర్ హిట్ కొట్టిన పోన్నియన్ సెల్వన్ మూవీతో త్రిష మరింత మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ ని కూడా బీట్ చేసి తన అంద చందాలతో మెరిసిపోయిందని చెప్పవచ్చు. వయసు పెరిగినా కొద్దీ ఈ అమ్మడి గ్లామర్ లో మాత్రం తగ్గేదేలే అంటుంది. అయితే తాజాగా త్రిష దళపతి విజయ్ తో జతకట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రాబోతుందని సమాచారం.
#Thalapathy67 – After fourteen years , #ThalapathyVijay and @trishtrashers to screen space! Excited for this fantastic combo 👌👌💥
— Rajasekar (@sekartweets) December 5, 2022
అయితే ఈ చిత్రంలో త్రిషని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ఇప్పటికే లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. విజయ్ తో సినిమా కూడా ఇదేవిధంగా ప్లాన్ చేస్తున్నారట. విజయ్ తో త్రిష 14 ఏళ్ల క్రితం గిల్లీ అనే మూవీలో నటించింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇద్దరి కాంబోలో మూవీ రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష హీరోయిన్ గా ఎంపిక కావడం ఆమెకు లక్కీ ఛాన్స్ అని చెప్పవచ్చు.
Advertisement
also read: