Home » అతిపిన్న వయసులోనే ఫిఫాలో 9 గోల్స్.. పీలే రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరంటే? 

అతిపిన్న వయసులోనే ఫిఫాలో 9 గోల్స్.. పీలే రికార్డును బ్రేక్ చేసిన ఆటగాడు ఎవరంటే? 

by Anji

ఫిఫా ప్రపంచ కప్ లో కైలియన్ ఎంబాప్పై, ఓలివర్ గిరౌండ్ పోలాండ్ ను చిత్త చేయడంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో తన రెండు గోల్స్ తో ఎంబాప్పే (24) ప్రపంచ కప్ లో9 గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.  ఇక 7 గోల్స్ చేసిన బ్రెజిల్ గ్రేట్ పీలేను అధిగమించాడు. ప్రపంచ కప్ లో 9 గోల్స్ చేయడంతో అర్జెంటీనా స్టార్ లియోన్ మెస్సీతో సమానంగా నిలిచాడు. దోహాలోని అల్ తుమామా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆదిపత్యం సాధించింది.

 హాఫ్ టైమ్ ముగిసే వరకు ఫ్రాన్స్ తరుపున గిరౌండ్ తొలి గోల్ చేశాడు. 44వ నిమిషంలో 36 ఏళ్ల గిరౌండ్ ఉస్మానే డెంబెలే ఇచ్చిన పాస్ లో హెడ్ గోల్ చేసి ఫ్రాన్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తరువాత గత ప్రపంచ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్ విజయం సాధించిన హీరో ఎంబాప్పే 74వ నిమిషంలో ఫ్రాన్స్ ఆధిక్యాన్ని రెట్టింపు చేసాడు. స్టాపేజ్ సమయంలో ఎంబాప్పే మరో గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ లో ఎంబాప్పే కి ఇది 7వ గోల్. పోలాండ్ తరుపున రాబర్డ్ లెవాండోస్కీ ఏకైక గోల్ చేశాడు. డియోట్ ఉపమెకానో చేతిలో హ్యాండ్ బాల్ కి స్టాపేజ్ టైమ్ లో పోలాండ్ కి పెనాల్టీ లభించింది. లెవాండోవ్స్కీ పోలాండ్ కోసం షాట్ ఆడాడు. గోల్ కీపర్ పై చేసిన ఫౌల్ కారణంగా రెఫరీ జీసస్ వెనిజులా పోలాండ్ కి రెండ పెనాల్టీని అందించాడు. ఈసారి లెవాండోస్కీ ఎలాంటి పొరపాటు చేయకుండా తన జట్టుకు గోల్ చేశాడు.

Manam News

1986 తరువాత పోలాండ్ మొదటిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. 1982లో తరువాత మొదటిసారి క్వార్టర్ ఫైనల్ కి చేరుకోవడం పై దృష్టి సారించింది. మిడ్ ఫీల్డ్ లో ఫ్రెంచ్ ఆధిపత్య ప్రదర్శన పోలిష్ ఆటగాళ్లకు స్కోర్ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్ అనంతరం ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చాంప్చ్ మాట్లాడుతూ.. “ఇది కఠినమైన మ్యాచ్. హాప్ టైమ్ తరువాత మేము కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. మా జట్టు ఐక్యంగా ఉంది. అది నేటి మ్యాచ్ లో కనిపించింది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు ముందు కుటుంబంతో మరికొంత సమయం గడుపుతాం అంటూ చెప్పుకొచ్చాడు. క్వార్టర్ ఫైనల్ లో ఇంగ్లండ్ లేదా సెనెగల్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఫ్రాన్స్ తలపడనుంది. 1990 నుంచి ప్రపంచ కప్ నాకౌట్ దశలో స్కోర్ చేసిన అతి పెద్ద వయస్సు ఆటగాడిగా గిరౌడ్ నిలిచాడు. గతంలో కామెరూన్ కి చెందిన రోజర్ మిలా 1990 ఫైనల్ 16లో కొలంబియాపై రెండుసార్లు గోల్స్ చేశాడు. 

Also Read :  FIFA World Cup 2022 : అద్భుతమైన గోల్ తో రికార్డు సృష్టించిన మెస్సీ..!

Visitors Are Also Reading