Home » jayaprda:142 చీరలతో జయప్రద సృష్టించిన సరికొత్త రికార్డ్..ఏంటంటే..?

jayaprda:142 చీరలతో జయప్రద సృష్టించిన సరికొత్త రికార్డ్..ఏంటంటే..?

by Sravanthi
Ad

అలనాటి హీరోయిన్లలో మంచి గుర్తింపు సాధించింది హీరోయిన్ జయప్రద. ఆమె తన సినీ కెరియర్ లో ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారట. అలాంటి సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఈమంది రామారావు కొన్ని కీలకమైన విషయాలను బయటపెట్టారు. మరి ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.. సీతారాములు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం. ఈ చిత్రానికి దాసరి నారాయణరావు డైరెక్టర్. ఈ చిత్రంలో రాము పాత్రలో కృష్ణంరాజు చేస్తే సీత పాత్రలో జయప్రద చేశారు.

Advertisement

also read:హిమాలయాల్లో లభించే ఈ పూల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

అయితే ఈ మూవీకి మొదటగా కథ లేదని తర్వాత అద్భుతమైన కథ సమకూరిందని పేర్కొన్నారు ఈమంది. అయితే ఈ చిత్రంలో జయప్రద గెటప్స్ చాలా గెటప్ చాలా వెరైటీగా వేర్వేరుగా ఉంటుందని ఈమంది రామారావు తెలియజేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ 40 రోజులు జరిగిందని, దీనికోసం జయప్రద 142 చీరలు మార్చే అవసరం వచ్చిందని తెలియజేశాడు. ఒక విధంగా ఇది రికార్డు అని చెప్పవచ్చు అన్నారు. అయితే సీతారాములు మూవీ విడుదలైన తర్వాత ఎన్నో కలెక్షన్లు వచ్చాయని తెలియజేశారు.

జయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతకు అనేక లాభాలు అందించిందని, ఈ సినిమాలోని తొలి సంధ్య వేళలో పాట అంచనాలకు మించి హిట్ గా నిలిచిందని తెలియజేశారు. ప్రస్తుతం జయప్రద రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్న జయప్రద కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ విధంగా జయప్రద తన కెరీర్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిందని ఈమంది తెలియజేశారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:ఫ్లిప్ కార్ట్ ఆఫర్ అదుర్స్: 16 వేల రూ”ఫోన్ ఆఫర్ లో 599కే ..!

Visitors Are Also Reading