Home » పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటిన కూలీ కుమార్తె.. 590 మార్కులతో..!

పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటిన కూలీ కుమార్తె.. 590 మార్కులతో..!

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. నిన్న పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 72.26 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదోతరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలురు 69.27 శాతం ఉత్తీర్ణత సాదిస్తే.. బాలికలు 75.38 శాతం మంది పాస్ అయ్యారు. వీరిలో బాలికలు 2,22,976 మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 2,14,220 మంది సత్తా చాటారు. 

Also Read :  ‘ది కేరళ స్టోరీ’ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా ?

Advertisement

ఇక జిల్లాల వారిగా పరిశీలించినట్టయిేత పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా చివరిస్థానం దక్కించుకుంది. వీరిలో ఇప్పుడు ఓ అమ్మాయి అందరి  దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ఓ కూలీ కుమార్తె 590 మార్కులతో సత్తా చాటడం విశేషం. పదోతరగతి ఫలితాలలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం పేరు బాగా వినిపిస్తోంది. ఎందుకు అంటే.. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పసుపులేటి గాయత్రికి పదోతరగతి ఫలితాల్లో 590 మార్కులు రావడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలో చదివిన గాయత్రి అద్భుతమైన మార్కులను సాధించింది. ఆమె తండ్రి రమేష్ కూడా గాయత్రి ప్రతిభ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు పదోతరగతి ఫలితాలలో 590 రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. టీచర్లు, గ్రామస్తులు అందరూ సంతోషపడుతున్నారు.  

Advertisement

Also Read :  పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ‘రంగస్థలం’ మహేష్ ఆసక్తికరవ్యాఖ్యలు..!

Manam News

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు 53.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. మరోవైపు 38 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ప్రైవేటు పాఠశాలల్లో 22, ఎయిడెడ్ పాఠశాలలో 7, ఆశ్రమ పాఠశాలలో 3 ప్రభుత్వ పాఠశాలలో 6 పాఠశాలలో ఒక్కో విద్యార్థి కూడా పాస్ కాకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. జూన్ 02 నుంచి జూన్ 10 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  

Also Read :  నిశ్చితార్థమై 4 నెలలు కావస్తున్నా శర్వానంద్ పెళ్లి ఉసేలేదు… మరి ఏమైనట్టు..!

Visitors Are Also Reading