Home » ‘ది కేరళ స్టోరీ’ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా ?

‘ది కేరళ స్టోరీ’ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా ?

by Anji
Ad

వివాదస్పద మూవీ ది కేరళ స్టోరీ విడుదలకు ముందు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ కొనసాగించిన విషయం తెలిసిందే. లవ్ జిహాద్ స్టోరీ లైన్ తో ఈ మూవీని తెరకెక్కించాడు. దాదాపు 32 వేల మంది యువతుల కథ ఇది అంటూ ముందు చెప్పగా.. ఆ తరువాత దానిని ముగ్గురు అమ్మాయిల కథ అంటూ చెప్పారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిదే. అయితే సెన్సార్ పూర్తి చేసుకున్నందున ఈ సినిమాని తాము ఆపలేమని కోర్టు స్పస్టం చేసింది. ప్రజలే ఈ సినిమాపై తీర్పు ఇస్తారంటూ వ్యాఖ్యానించింది ధర్మాసనం. ఈ సినినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందంటూ కూడా విమర్శలు వినిపించాయి.  ఈ సినిమా ఫస్ట్ రోజు ఎంత వసూలు చేసింది. ప్రజల నుంచి ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  నిశ్చితార్థమై 4 నెలలు కావస్తున్నా శర్వానంద్ పెళ్లి ఉసేలేదు… మరి ఏమైనట్టు..!

Advertisement

kerala-story-review

Advertisement

 

ది కేరళ స్టోరీ అనే మూవీ యదార్థ జీవితాల ఆధారంగా తీసిన కథ అంటూ దర్శకుడు సుదీప్తో సేన్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కథ కోసం దాదాపు రెండేళ్ల పాటు చాలా కష్టపడినట్టు తెలిపారు దర్శకుడు. లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడం వారిని ఐసీఐసీలో చేర్పించడం అనే అంశాలపై ఈ మూవీ ఉంటుంది. ఇందులో నటిగా ఆదాశర్మ మంచి మార్కులే కొట్టేసింది. ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. కొందరూ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరూ టార్గెటేడ్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు.  

Also Read :   జపాన్లో “ఆరెంజ్” రీ రిలీజ్… అక్కడ రామ్ చరణ్ కు మామూలు క్రేజీ లేదుగా..!

ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే కాస్త షాకింగ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ డే దాదాపు రూ.8కోట్లు కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. మరికొందరూ ఆ అంకె మరింత ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి కశ్మీర్ ఫైల్స్ తో పోల్చితే ఇది చాలా పెద్ద నెంబర్. ఎందుకంటే కశ్మీర్ పైల్స్ చిత్రం కేవలం రూ.3.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ ఆ తరువాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ది కేరళ స్టోరీ ఫస్ట్ డే రూ.8కోట్లు వసూలు చేస్తే.. లాంగ్ రన్ లో మరింత పుంజుకునే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.  

Also Read :  పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ‘రంగస్థలం’ మహేష్ ఆసక్తికరవ్యాఖ్యలు..!

Visitors Are Also Reading