రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దేశం వెలుపల సైనిక బలగాలను ఉపయోగించుకునే హక్కును మంజూరు చేయడంతో ఉక్రెయిన్ నిన్న దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరొక వైపు పాశ్చాత్య దేశాలు రష్యాపై వరుస ఆంక్షలను ప్రకటించాయి. ఉక్రెయిన్‌లోని మాస్కో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసి దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించింది. గురువారం నుంచి 30 రోజుల పాటు అమలులో ఉండే దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని విధించాలన్న అధ్యక్షుడు ఓలోడిమిర్ జెలన్స్కీ ఉక్రెయిన్ చట్ట సభ్యులు ఆమోదించారు. దాడికి ఆదేశిస్తే ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర మొహరించిన రష్యా బలగాలు దాని కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని అమెరికా సీనియర్ రక్షణ అధికారి ఒకరు వెల్లడించారు.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
Advertisement
Advertisement
దాదాపు 80 శాతం బలగాలు సన్నద్ధమై ఉన్నాయని వెల్లడించారు. సరిహద్దు నుంచి ఐదు నుంచి 50 కి.మీ. పరిధిలో మొహరించినట్టు అజ్ఞాత షరతుపై అధికారి తెలిపారు. రష్యన్ దళాలు డాన్ బాస్ లోకి ప్రవేశించాయో లేదో మేము ఇంకా నిర్దారించలేము అని చెప్పారు. ఇదిలా ఉండగా తూర్పు వేర్పాటు వాద ప్రాంతాల్లో కొనసాగుతున్న హింసా, మారణ హోమం ఆపడానికి సాయం చేయాలని ఐక్యరాజ్యసమితిలోని రష్యా రాయబారి ప్రపంచ దేశాలను కోరారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల ఉదాసీనత ప్రదర్శించే ఉద్దేశం లేదని ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా యూఎన్ జనరల్ అసెంబ్లీకి చెప్పారు.
లూహాన్స్క్, డొనెట్క్స్ నుంచి రష్యాకు వేలాది మంది ప్రజలు రావడంతో ఉక్రెయిన్ వారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. మరొకవైపు ఉక్రెయిన్ తన రాయభార కార్యాలయాన్ని రష్యా తీవ్ర సంక్షోభం మధ్య ఖాళీ చేసింది. రష్యా ప్రభుత్వ వార్త సంస్థ టాస్ ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మాస్కో ఖాళీ చేసిందని తెలిపింది. అదే సమయంలో ఉక్రెయిన్ తన పౌరులను రష్యా నుంచి విడిచి పెట్టాలని కూడా కోరింది. మాస్కో కీవ్‌లో రాయబార కార్యాలయం ఖార్కివ్, ఒడెస్సా, ఎల్వివ్‌లలో కాన్సులేట్‌లున్నాయి. ఉక్రెయిన్‌లోని తన దౌత్య స్థాపనలను రష్యా ఖాళీ చేసిందని టాస్ వార్తలు వెల్లడించాయి.
Also Read : సచిన్ సాయం అడిగిన కోహ్లీ.. ఎందుకంటే..?