Home » Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…

Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…

by Bunty

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు సందడి చేస్తున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందులో విజయవాడ బ్యూటీ డింపుల్ హయాతి ఒకరు. చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ సుదీర్ఘమైన కెరీర్ లో చాలా తక్కువ సినిమాలనే చేసింది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం భారీ స్థాయిలో పాపులర్ అవుతూ ఆఫర్లను పట్టేస్తోంది.

అయితే తాజాగా డింపుల్ హయాతీపై హైదరాబాదులో పోలీస్ కేసు నమోదు అయింది. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ ఐపీఎస్ అధికారితో డింపుల్ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారి వాహనాన్ని కాలితో తన్నడం, దుర్భాషలాడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో హీరోయిన్ డింపుల్ హయాతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఇటీవలే అదే అపార్ట్మెంట్ లోకి ఓ ఐపీఎస్ అధికారి అద్దెకు దిగారు.

పార్కింగ్ విషయంలో ఐపీఎస్ అధికారి రాహుల్ తో నటి డింపుల్ కు వివాదం తలెత్తింది. వాహనాన్ని పార్కింగ్ చేసే క్రమంలో ఐపీఎస్ అధికారి వాహనం అక్కడ ఉండడంతో డింపుల్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డింపుల్ సమయమనం కోల్పోయి అయితే అధికారి వాహనంపై దాడి చేసి కాలితో పదే పదే కొట్టడం, ఆయన్ని దూషించడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డింపుల్ హయాతీపై ఐపీసీ సెక్షన్లు 341, 379, 350 కింద కేసులు నమోదు చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

అతడు సినిమాలో అసలు నందు ఎవరు?

Visitors Are Also Reading