Home » చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లా మల్టీ స్టారర్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే ?

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లా మల్టీ స్టారర్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే ?

by Bunty
Ad

దర్శకేంద్రుడు ఒకే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అన్ని రకాల సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటే ఆలోచించకుండా థియేటర్లకు ఎగబడి పోతారు ప్రేక్షకులు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి గంగోత్రి సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

Advertisement

రాఘవేంద్రరావు 100వ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేసుకోవాలని అనుకున్నారట. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో ”త్రివేణి సంగమం” అనే చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ ముగ్గురు మల్టీ స్టార్స్ తో సినిమా అంటే భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇందులో ఏమాత్రం తేడా ఉన్నా ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టినట్టు అవుతుందని ఈ సినిమాను క్యాన్సల్ చేసుకున్నాడట. ఇక కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. దానికి “గంగోత్రి” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకోసం హీరోగా రామ్ చరణ్ అయితే బాగుంటాడని చిరంజీవిని అడిగాడట.

Advertisement

కానీ చిరంజీవి చరణ్ కి ఇంకా మెచ్యూరిటీ రావాలని చాలా సున్నితంగా తిరస్కరించారట. అల్లు అరవింద్ తన అబ్బాయి అల్లు అర్జున్ ను హీరోగా పెట్టుకోమని రిక్వెస్ట్ చేశారట. ఇక గంగోత్రి సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. అందువల్ల అతను కాదనలేక అల్లు అర్జున్ ను హీరోగా ఫిక్స్ చేశారట. ఇందులో ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ హీరోయిన్. 2003 మార్చి 28న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. మొదట ఈ చిత్రాన్ని అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత గంగోత్రి తీర్థం పోస్తున్నారు అని చెప్పడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీకి వెళ్లడం ప్రారంభించారు. టికెట్ చూపించిన వారికి మాత్రమే గంగోత్రి తీర్థం పోశారు. అలా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

అమ‌ల ఏ దేశానికి చెందిన మ‌హిళ‌నో తెలుసా..ఆమె త‌ల్లి ఎవ‌రంటే…!

ఇడియట్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి !

శివరామరాజు సినిమాలో ‘చెల్లి’గా నటించిన బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading