సాధారణంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోగలరు. డెలివరీ అయిన మహిళకు ప్రభుత్వం రూ.5000 ఆర్ధిక సాయం అందిస్తుందని చాలామందికి తెలియకపోవచ్చును. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? అర్హతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
2010 లో ‘ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజన’ అనే పేరుతో డెలివరీ అయిన మహిళలకు చేయూత అందించే పథకంప్రారంభించారు. అయితే 2017 లో దాని పేరు ‘ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన’ అని పేరు మార్చారు. ఈ స్కీమ్ కింద గర్భిణీలు డెలివరీ అయిన తరువాత రూ.5000 వేలు బెనిఫిట్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో సాయం కోరే మహిళలు అంగన్ వాడీ కేంద్రం, లేదా ఉమాంగ్ యాప్ లేదా ఉమాంగ్ వెబ్ సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
Advertisement
ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకానికి అప్లై చేసుకున్న వెంటనే మొదట విడత రూ.1000 బ్యాంకు అకౌంట్లో వేస్తారు. రెండవ ఇన్స్టాల్మెంట్ క్రింద బిడ్డ పుట్టిన 6 నెలల తర్వాత మరో రూ.2000 లు బ్యాంకులో వేస్తారు. ఇక 3 వ ఇన్స్టాల్ మెంట్ క్రింద రూ.2000 లు వేక్సినేషన్, బర్త్ సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో బ్యాంకులో వేస్తారు. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు.. కానీ వారికి ఎటువంటి ఆదాయం ఉండకూడదు. గృహిణి అయ్యి ఉండాలి. డెలివరీ అయ్యి 150 రోజుల లోపు అయిన మహిళలు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే డెలివరీ అయిన తరువాత మాత్రమే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ పథకానికి అర్హులైన మహిళలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న అక్కినేని అఖిల్…!
పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత.. రేణు దేశాయ్ ఆ కారణం వల్లనే మళ్లీ పెళ్లి చేసుకోలేదా ?