సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, వారి కూతుర్లు, కుమారులు ఉంటుంటారు. వారి తరువాతనే వారు నట వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. కొంత మంది మాత్రం తమ పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకురాకుండా వ్యాపారాల్లో సెటిల్ చేస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు శోభన్ బాబు పేరు ముందు వరుసలో ఉంటుంది.
Advertisement
కొందరు హీరోలు తమ కుమారులు, కూతుర్లు లేదా వారి కుటుంబం నుంచి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అలా కొంతమంది నటులు ఎంత ఫేమస్ అయినా కానీ వారి కుటుంబం గురించి ఏ విషయం కూడా బయటకు రానివ్వరు. కనీసం ఎవరికి తెలియనివ్వరు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పటి స్టార్ విలన్ , మరియు హీరో దేవరాజు.ఒకప్పటి తరానికి ఈయన తెలియని వారు ఉండరు. ఆయన కన్నడ ఇండస్ట్రీలో 50 పైగా సినిమాల్లో హీరోగా చేశారు. అదే సమయంలో తెలుగులో కూడా తనదైన విలనిజంతో ఆకట్టుకున్నారు.
Advertisement
టాలీవుడ్ లో 20వ శతాబ్దం,బంగారు బుల్లోడు, ప్రేమ యుద్ధం, యజ్ఞం, యోగి, భరత్ అనే నేను వరకు ఎన్నో పాత్రల్లో విలన్ గా నటించారు. అలాంటి దేవరాజు భార్య కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ నట. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.. దేవరాజు భార్య పేరు చంద్రలేఖ. ఈమె దేవరాజుతో సిక్కు, కేదార్ మలై, వంటి సినిమాలలో నటించింది. ఇదే సమయంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారట.ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారట.ఆ తర్వాత చంద్రలేఖ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిందట. ప్రస్తుతం దేవరాజుకు ఇద్దరు కొడుకులు. వీరు కూడా కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు.