సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ‘జైలర్’ మూవీతో భారీ సక్సెస్ సాధించారు. దీంతో అభిమానులకు గ్రాండ్ ట్రీట్ కూడా అందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఈ సినిమా సక్సెస్ ను అందుకునన రజినీ పై ఫ్యాన్స్, సాధారణ ఆడియెన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలోనే తలైవా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
Advertisement
రజినీకాంత్ జైలర్ మూవీ కేవలం 10 రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొడుతుంది. ఈ తరుణంలోనే ఆధ్యాత్మిక భావన కలిగిన రజినీకాంత్ హిమాలయాలు వెళ్లి.. అక్కడ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. లక్నో పర్యటనలో భాగం యోగి ఆదిత్యనాథ్ కలిసి సందర్భంలో ఆయన పాదాలను తాకి నమస్కరించారు. దీంతో తమిళుల ఆత్మగౌరవాన్ని నార్త్ ఇండియా పొలిటిషియన్ల వద్ద భంగపరిచారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. రజినీకాంత్ కంటే వయస్సులో చిన్నవాడు అయినటువంటి యూపీ సీఎం కాళ్లు పట్టుకోవడం ఏంటి అని ట్రోలింగ్స్ చేశారు. ఈ వివాదం పై తాజాగా రజినీకాంత్ స్పందించినట్టు తెలుస్తోంది.
Advertisement
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడంపై తలైవా క్లారిటీ ఇచ్చారు. “ నాకంటే వయస్సులో చిన్న వాళ్లు అయినప్పటికీ.. వాళ్లు యోగి అయినా.. సన్యాసి అయినా వారి పాదాలకు నమస్కారం చేయడం నాకు అలవాటు. అదే చేశాను” అంటూ వెల్లడించారు రజినీకాంత్. రజినీకాంత్ ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఇలా చేసినట్టు చెప్పుకొచ్చారు. రజినీకాంత్ చెప్పిన సమాధానంతో తమిళులు సంతృప్తి చెందుతారో లేదో మరి వేచి చూడాలి. ఇక రజినీ సినిమాల విషయానికొస్తే.. జైలర్ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత లాల్ సలామ్, తలైవార్ 170 వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చిరంజీవి వల్ల నవ్వుల పాలైన సీనియర్ స్టార్ హీరో ఎవరో తెలుసా…?
“ఖడ్గం” తీసిన తర్వాత…చంపేస్తారనే భయంతో వారం రోజులు కృష్ణవంశీ దాక్కున్నాడు !
అన్నగారికి చంద్రబాబు నిజంగానే వెన్నుపోటు పొడిచాడా ? ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్