Home » డబుల్ రోల్ చేసి ఏ హీరో ఎన్ని సక్సెస్ లు సాధించారో తెలుసా ?

డబుల్ రోల్ చేసి ఏ హీరో ఎన్ని సక్సెస్ లు సాధించారో తెలుసా ?

by Anji

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు రకరకాల పాత్రలు చేస్తుంటారు. అయితే ఎక్కువగా కొంత మంది హీరోలు డ్యుయల్ రోల్ పోషించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొంత మంది హీరోలు డబుల్ రోల్ లో సక్సెస్ సాధిస్తే.. మరికొందరూ ఫెయిల్యూర్ సాధిస్తారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఎన్టీఆర్ :

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మనం చూసినట్టయితే ఆంధ్రావాలా మూవీలో డబుల్ రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీని తరువాత అదుర్స్ సినిమాలో డబుల్ రోల్ లో నటించి మెప్పించిన ఆయన ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చేసిన శక్తి మూవీలో కూడా మరోసారి డబుల్ రోల్ చేసి మరోసారి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత జై లవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. మొత్తం నాలుగు సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్ లో కనిపించి అందులో రెండు హిట్లు, రెండు ఫ్లాప్ లు అందుకున్నాడు ఎన్టీఆర్. 

పవన్ కళ్యాణ్ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్ మాన్ సినిమాలో డబుల్ రోల్ లో నటించాడు. నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మళ్లీ డబుల్ రోల్ ఉన్న సినిమాలో నటించలేదు పవన్ కళ్యాణ్. 

రవితేజ :

రవితేజ హీరోగా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాడు. ఆయన డబుల్ రోల్ చేసి మంచి విజయం అందుకున్న సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి.  ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు రవితేజ.

రామ్ చరణ్ :

ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో రామ్ చరణ్ ఒకడు. ఈయన తీసిన సినిమాల్లో చాలా వరకు హిట్ సాధించాయి. అందులో రామ్ చరణ్ డబుల్ రోల్ చేసి సక్సెస్ సాధించిన సినిమాల్లో మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా తరువాత మంచి విజయం సాధించిన మరో సినిమా నాయక్. ఈ రెండు సినిమాల్లో కూడా ఆయన సూపర్ గా నటించి మంచి పేరు సంపాదించాడు. 

ప్రభాస్  :

ప్రభాస్ కూడా డ్యుయల్ రోల్ నటించి మంచి విజయాన్ని సాధించాడు. అందులో బిల్లా మూవీ ఒకటి. బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ డబుల్ రోల్ లో నటించి మెప్పించాడు. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరో గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభాస్ ఏ సినిమా తీసినా పాన్ ఇండియా రేంజ్ లో నటిస్తున్నాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“టైగర్‌ నాగేశ్వరరావు” కు మొదట అనుకున్న హీరో రవితేజ కాదా? ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు?

బాలకృష్ణని దర్శకుడు అనిల్ రావిపూడి అంతలా మార్చేశాడా ?

Visitors Are Also Reading