Home » “టైగర్‌ నాగేశ్వరరావు” కు మొదట అనుకున్న హీరో రవితేజ కాదా? ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు?

“టైగర్‌ నాగేశ్వరరావు” కు మొదట అనుకున్న హీరో రవితేజ కాదా? ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు?

by Srilakshmi Bharathi
Ad

మాస్ మహారాజ్ రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా “టైగర్‌ నాగేశ్వరరావు”. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీగా అంచనాలు మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి టీజర్ వచ్చింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

tiger nageswara rao

Advertisement

ఈ సినిమాను టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక, టైగర్ నాగేశ్వరరావు పాత్రను రవితేజ పోషిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ నాయుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 20 వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా మొదట హీరో రవితేజ కోసం అనుకోలేదట. పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ను ఈ సినిమాలో హీరోగా మొదట అనుకున్నారట. కానీ, ప్రభాస్ రిజెక్ట్ చేశారట. ఇప్పటికే ఆయన సలార్‌, కల్కి, మారుతి రాజా డీలక్స్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి అవ్వడానికి నాలుగేళ్ళ సమయం పడుతుంది. దీనితో డేట్స్ దొరక్క ప్రభాస్ నో చెప్పారట. దీనితో ఈ అవకాశం రవితేజకు వెళ్ళింది.

మరిన్ని..

Kalki: ప్రభాస్ “కల్కి” నుంచి మరో ఇంటరెస్టింగ్ అప్ డేట్.. ఆ స్టార్ హీరో నటిస్తున్నారా?

అవార్డు వస్తే ఆ రోజు బ్రహ్మానందం ఏం చేస్తాడో తెలుసా? అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు!

Visitors Are Also Reading