Home » శ్రీలీలను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేయడం వెనుక కారణం ఇదేనా ? 

శ్రీలీలను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేయడం వెనుక కారణం ఇదేనా ? 

by Anji
Ad

యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. అయితే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో ప్రేక్షకుల ముందుకొచ్చిన పెళ్లి సందD మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది శ్రీలీల. తన తొలి సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు.  ఈ చిత్రంలో శ్రీలీల నటనకు ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు.

Advertisement

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం శ్రీలీల నటనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం దాదాపు డజన్ కి పైగా సినిమాలను తన చేతిలో పెట్టుకొని కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటేడ్ బ్యూటీగా ఉన్న శ్రీలీల కోసం దర్శక, నిర్మాతలు ఆమె వెంట పడుతూ తన కాల్షీట్స్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. యంగ్ హీరోలు కూడా ఈమెనే తొలి ఆప్షన్ గా చెప్పడంతో ఈమెకు ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది యంగ్ హీరోలు, దర్శక నిర్మాతలు శ్రీలీల వెంట పడుతున్నప్పటికీ ఈమెకు సమయం కుదరక కొన్ని సినిమాలను రిజెక్ట్ కూడా చేసిందట. ఇప్పటివరకు శ్రీలీల రిజెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి.

Advertisement

తాాజాగా ఓ స్టార్ హీరో శ్రీలీలను రిజెక్ట్ చేశాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్ ని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరు ? అసలు ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయం గురించి చర్చలు ప్రారంభించారు. శ్రీలీలను రిజెక్ట్ చేసిన హీరో మరెవ్వరో కాదండోయ్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఇందులో ఒకరు శ్రీలీల అంటూ వార్తలు వినిపించాయి. కానీ శ్రీలీల ఈ మూవీలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకోలేదట. ప్రభాస్ ని చూస్తే ఆరు అడుగులు ఉంటాడు. ఆయన పక్కల శ్రీలీల చాలా పొట్టిగా ఉంటుందనే కారణంతో శ్రీలీల నటించడానికి ప్రభాస్ రిజెక్ట్ చేశారనే వార్త వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె హీరోని డామినేట్ చేస్తుందని తీసేసారట..!

 ఏడేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ భోళా శంకర్ మూవీని మొదలు పెట్టాడనే విషయం మీకు తెలుసా ? 

Visitors Are Also Reading