Home » విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె హీరోని డామినేట్ చేస్తుందని తీసేసారట..!

విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె హీరోని డామినేట్ చేస్తుందని తీసేసారట..!

by Mounika
Published: Last Updated on
Ad

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తేజ్… వరుస సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్స్ మరియు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కథాంశాలని సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు తేజ్ .

Advertisement

ఇక బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ని కాబట్టి సూపర్ హిట్ సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకు ఎక్కించాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన యాక్టింగ్ తో థియేటర్లోని ప్రేక్షకులను సంయుక్త బాగా ఆకట్టుకుంది. హారర్ కథాంశంతో వచ్చిన విరూపాక్ష చిత్రం దాదాపు 200 కోట్లు వరకు వసూల్ రాబట్టింది.

Advertisement

అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకోవాలని భావించారట మూవీ మేకర్స్. సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే సాయితేజ్ అదే సమయంలో ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. వీరిద్దరూ కలసి నటిస్తే సాయి పల్లవి సాయిధర్మతేజ్ ని డామినేట్ చేసే ఛాన్స్ ఉందని మేకర్స్ భావించారట. అందుకే ఈ సినిమా నుంచి సాయి పల్లవిని తొలగించాల్సి వచ్చిందని సమాచారం వినిపిస్తుంది . అయితే సాయితేజ్, సాయి పల్లవి కాంబో బాగుంటుందని, ఇద్దరు కనుక కలిసి నటిస్తే సి నిమా మరో లెవల్లో ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

 చెన్నై, బెంగళూరులో రజినీ జైలర్ ఫీవర్.. ఆఫీస్ లకు సెలవు, ఫ్రీ టికెట్స్..!

బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ? 

Visitors Are Also Reading