Home » వరుస గాయాలు.. క్రికెట్ కు బుమ్రా రిటైర్మెంట్ ?

వరుస గాయాలు.. క్రికెట్ కు బుమ్రా రిటైర్మెంట్ ?

by Bunty
Ad

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా బౌలర్ల విషయం వస్తే… మొదటగా గుర్తుకు వచ్చేది జస్ప్రిత్ బుమ్రా మాత్రమే. నిప్పు రవ్వ లాంటి బంతులను సంధిస్తూ… బ్యాట్స్మెన్ లకు వణుకు పుట్టిస్తాడు బుమ్రా. అయితే గత కొన్ని రోజులుగా జస్ప్రిత్ బుమ్రా టీమిండియా కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వరస మ్యాచ్లతో గాయపడిన జస్ప్రిత్ బుమ్రా… ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ అకాడమీలో రికవరీ అవుతున్నాడు.

Advertisement

అతి తక్కువ రన్నర్ ఆఫ్ లో 140 కిలో మీటర్ల నుంచి 150 కిలో మీటర్ల స్పీడుతో బంతులు విసరగల సమర్ధుడు జస్ప్రిత్ బుమ్రా. అయితే ఇదే అతని కొంప ముంచిందని కొంతమంది సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. అలా తక్కువ రన్నరప్ తో బంతులు వేయడం కారణంగానే…. జస్ప్రిత్ బుమ్రాకు గాయాలు అవుతున్నాయని… ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ పేర్కొన్నారు. ఈ సమస్యల నుంచి జస్ప్రిత్ బుమ్రా బయటపడడానికి రిటర్మెంట్ తీసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఈ ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మెక్ గ్రాత్. ప్రస్తుతం టీమిండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా… మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు…అటు ఐపీఎల్ కూడా విపరీతంగా ఆడుతున్నాడు… దీనివల్ల అతని ఫిట్నెస్ పై ఎఫెక్ట్ పడుతోందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఏదో ఒక ఫార్మాట్ కు జస్ప్రిత్ బుమ్రా రిటైర్మెంట్ ప్రకటించాలని గ్లెన్ మెక్ గ్రాత్ సూచించారు.

Advertisement

లేకపోతే అతడు మళ్లీ గాయపడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ఈ ఆస్ట్రేలియా దిగ్గజం. తాను కూడా జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ కు చాలా పెద్ద ఫ్యాన్ అని… అతని బౌలింగ్ శైలి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని కొనియాడారు. కానీ అతను తన కెరీర్ లో ఇంకా ముందుకు సాగాలంటే ఏదో ఒక ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే జస్ప్రిత్ బుమ్రా కెరీర్ కే ప్రమాదం పొంచి ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించారు గ్లెన్ మెక్ గ్రాత్. కాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా… ఐర్లాండ్ టూర్కు సెలెక్ట్ అయ్యాడు. ఐర్లాండ్ టూర్ తో రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా… టీమిండియా కెప్టెన్ గా కూడా ఎంపిక అయ్యాడు బుమ్రా.

ఇవి కూడా చదవండి

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

Visitors Are Also Reading