Home » థియేటర్లలో దుమ్మురేపుతోన్న పవర్ స్టార్ “బ్రో” మూవీ..! ఫస్ట్ డే ఎంత వసూళ్లు రాబట్టిందంటే..?

థియేటర్లలో దుమ్మురేపుతోన్న పవర్ స్టార్ “బ్రో” మూవీ..! ఫస్ట్ డే ఎంత వసూళ్లు రాబట్టిందంటే..?

by Mounika
Ad

ఈ జూలై 28న పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసిన నటించిన బ్రో చిత్రం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. “బ్రో” ది అవతార్ సినిమా తమిళ్ మూవీ వినోదయ సిత్తంకు రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. బ్రహ్మానందం చిత్రంలో కీలక పాత్ర పోషించారు.  5జీ సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ బ్రో చిత్రానికి గాను నిర్మాణ సారథ్యం వహించారు. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Advertisement

 ఈ మూవీ  ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడంతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇద్దరు మెగా హీరోలు నటించిన చిత్రం కావడంతో బ్రో సినిమా విడుదల కాకముందు నుంచి ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు మెగా హీరోలు ఒకే తెరపై కనిపించడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు సాయిధర్మతేజ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఇక నిన్నే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

Advertisement

బ్రో మూవీ మొదటి రోజు భారీ ఓపినింగ్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. బ్రో మూవీ రూ.30 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ట్రేడ్ వర్గాలు సైతం ఈ మూవీకి 20 కోట్ల వరకు వసూల్ చేస్తుందని అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు మించి 30 కోట్లు పైగా కలెక్షన్ ని రాబట్టింది. ఏరియా వారిగా  బ్రో చిత్రం ఎంతెంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

నైజాం లో రూ. 8.45 కోట్లు, సీడెడ్ లో రూ.2.70 కోట్లు, ఉత్తరాంధ్ర లో రూ.2.60 కోట్లు  ఈస్ట్  రూ.2.45 కోట్లు, వెస్ట్  రూ.2.98 కోట్లు, కృష్ణా  రూ.1.21 కోట్లు, గుంటూరు రూ.2.51 కోట్లు, నెల్లూరు  రూ.71 లక్షలు వరకు వసూలు  రాబట్టింది. ఆంధ్ర –  తెలంగాణలో టోటల్గా రూ.35.50 కోట్లు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ : రూ.4.30 కోట్లు, వరల్డ్ వైడ్ : రూ.48.09 కోట్లు కలెక్షన్స్ తో బ్రో మూవీ దుమ్ము రేపింది. ఇక  వీకెండ్ కావడంతో శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  :

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

విక్టరీ వెంకటేష్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడా..?

ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న గోపీచంద్…కానీ !

Visitors Are Also Reading