ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన చిత్రాలలో ఉత్కంఠభరితమైన విన్యాసాలతో కూడిన ఫైట్ సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తన తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలోనే పవన్ తన శరీరంపై బరువైన రాళ్లను పగలగొట్టి అందరినీ షాక్‌కి గురిచేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన అనేక చిత్రాలలో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక చాలామంది పవన్ కళ్యాణ్ కి చదువు రాలేదు కాబట్టి సినిమాల కోసమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటారు.
కానీ దాని వెనుక కారణం మరొకటి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆయన మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి గల వెనుక ఉన్న కారణం ఏమిటో తెలియజేశారు. అప్పటి రోజుల్లో నాగబాబుకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని చిరంజీవి అనుకున్నారట. కానీ నాగబాబు ఎందుకో కానీ ఆసక్తి చూపించలేదు. పవన్ కూడా ముందు నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై అంత ఆసక్తి ఉండేది కాదట. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
అప్పటిలో సినీ ఇండస్ట్రీ మద్రాస్ లో ఉండటం వల్ల చిరంజీవి కుటుంబం అంతా ఆ సమయంలో అక్కడే సెటిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చెన్నైలో కాలేజ్ చదివే సమయంలో కొందరు తమిళవారు చిరంజీవి సినిమాలు చూసి అతన్ని ఊరికే తిట్టేవాళ్లట. కాలేజీలో కొందరు పవన్ ముందే తన అన్నయ్య నటనతో పాటు వేషధారణ పై కూడా విమర్శలు చేసే వారట. అలాంటి కామెంట్స్ విన్నప్పుడు నాకు పట్టలేనంత కోపం వచ్చినా సన్నగా రివటలా ఉండడం చేత వాళ్లను ఎదిరించలేకపోయాను.
ఆ సమయంలో వారి ఎదిరించాలి అంటే నా ముందు ఉన్న ఏకైక ఎంపిక మార్షల్ ఆర్ట్స్ ని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అలా అన్నయ్య చిరంజీవిని కామెంట్ చేసిన వారి తుక్కు రేగ్గొట్టాలానే ఉద్దేశంతో పవన్ కరాటేలో శిక్షణ తీసుకొని బ్లాక్ బెల్ట్ ను కూడా సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ బిగినింగ్ లో ఆయన నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ సినిమాలకు కూడా బాగా కలిసి వచ్చింది . అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, బద్రి, ఖుషీ, జల్సా లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ బాగా ఉపయోగపడింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ప్రభుదేవాని హీరోగా పెట్టి సినిమా తీస్తే కుక్కలు కూడా చూడవు అని అవమానించిన వ్యక్తి ఎవరు..?
హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!
Bro: “బ్రో” ఈవెంట్ లో పవన్ అలా మాట్లాడడానికి కారణం అయిన ఆ రూల్స్ ఏంటి?