రెండేళ్ల కాలంలో పాకిస్థాన్ కు చెందిన దాదాపు 629 మంది అమ్మాయిలు మరియు మహిళలు చైనా పురుషులకు భార్యలుగా అమ్మబడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ తన ఇన్వెస్టిగేటెడ్ జర్నలిజంలో తేల్చింది దానికి సంబంధించిన నివేదికలు కూడా ప్రకటించింది.
చైనాతో తమ వ్యాపార సంబంధాలు ఎక్కడ దెబ్బ తింటాయోనని ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం కావాలనే దాస్తుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో పాక్ లోని ఫైసలాబాద్‌లోని కోర్టు అభియోగాలు మోపబడిన 31 మంది చైనా పౌరులను నిర్దోషులుగా ప్రకటించింది. ట్రాఫికింగ్ లో ఇరుక్కున అనేక మంది మహిళలు సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో కోర్ట్ ఈ కేసును కొట్టేసింది.
Also Read: తెలుగు యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్కవ ఎవరికంటే..?
ఈ అమ్మాయిలకు ఎవరూ సహాయం చేయడం లేరని, ఈ ట్రాఫికింగ్ రాకెట్ రోజురోజుకు పెరుగుతోందని పాక్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తెలిపాడు. చైనా విదేశాంగ శాఖ ఈ విషయం గురించి తమకు తెలియదని చెప్పింది.
పెళ్లిళ్ల బ్రోకర్ ….ఇక్కడి పేద అమ్మాయిల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి మంచి సంబంధం పేరుతో చైనీస్ కుర్రాళ్లకు పెళ్లి చేసేస్తారు. ఈక్రమంలో అమ్మాయిల తల్లిదండ్రులకు పెద్ద మొత్తంలో డబ్బును ముట్టజెబుతారు. వీరిని అక్కడికి తీసుకెళ్లి అక్కడ వ్య_ చార వృత్తిలోకి దింపుతారు.
Also Read: బండ్ల గణేష్ కు మూడో సారి కరోనా పాజిటివ్…!