Telugu News » బండ్ల గణేష్ కు మూడో సారి కరోనా పాజిటివ్…!

బండ్ల గణేష్ కు మూడో సారి కరోనా పాజిటివ్…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. బండ్ల గణేష్ కు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలోనూ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ సమయంలో అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో బండ్లగణేష్ ఆరోగ్య పరిస్తితి విషమించింది కూడా.. కానీ మళ్లీ కోలుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరోసారి కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని బండ్లగణేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Ads

గత మూడు రోజులు తాను ఢిల్లీలో ఉన్నట్టు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్పష్టం చేశారు. లక్షణాలు తక్కువగానే ఉన్నాయని తన కుటుంబసభ్యులు కూడా కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ట్రావెలింగ్ సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని బండ్ల గణేష్ కోరారు.

 

ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని బండ్లగణేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు సినీ తారలు కరోనా కారణంగా ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరో మంచు మనోజ్, మంచు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్ అదేవిధంగా తమిళ హీరో విష్ణు విశాల్ మరియు నటుడు సత్యరాజ్ కూడా కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు.


You may also like